India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వాగులో జారిపడి మహిళా గల్లంతైన ఘటన జడ్చర్ల మండలంలో బుధవారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. నెక్కొండకు చెందిన జ్యోతి (35) పొలం పనులకు వెళ్తుండగా వాగులో జారి పడి గల్లంతు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా గండీడ్ మండలం సర్కార్ పేటలో 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహమ్మదాబాద్ 9.5, చిన్నచింతకుంట 11.0, సీసీ కుంట మండలం వడ్డేమాన్ లో 7.3, కౌకుంట్ల 3.8, జడ్చర్ల 3.5, రాజాపూర్ 1.3, మహబూబ్ నగర్ అర్బన్, బాలానగర్ 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.

ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమావేశం అయ్యారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో వేదిక వీఐపీలు, అధికారులు, మీడియా ఇతరులకు సీటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. పెరేడ్ మైదానంలో తాగునీరు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు.

పాలమూరు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ గౌస్ మొహియుద్దీన్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని పాలమూరు యూనివర్సిటీ ఉపసంచాలకులు ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ మంగళవారం అందజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ విభాగానికి చెందిన డాక్టర్ రవికుమార్‌ను అకాడమిక్ ఆడిట్ సెల్ కోఆర్డినేటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్యపూస రమేశ్ బాబు, అకాడమీ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్ర కిరణ్ నియామక పత్రాన్ని అందజేశారు. ప్రిన్సిపల్స్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ రవికాంత్, డాక్టర్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు మహబూబ్‌నగర్ రీజినల్ మేనేజర్ పి.సంతోష్ కుమార్ Way2Newsతో తెలిపారు. ఈ నెల 7 నుంచి 9 వరకు హైదరాబాద్ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలలోని వివిధ ప్రాంతాలకు 245 అదనపు ట్రిప్పులను, ఈనెల 9 నుంచి 11 వరకు HYDకు వెళ్లేందుకు 155 అదనపు ట్రిప్పులను నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని రోజులుగా తేలికపాటి వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచి ఆకాశం మేఘాకుతమై ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు సూచించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా గండీడ్ మండలం సల్కర్ పేటలో 41.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మహమ్మదాబాద్ 14.0, దేవరకద్ర 8.5, మహబూబ్‌నగర్ అర్బన్ 6.5, కోయిలకొండ మండలం పారుపల్లి 4.3, భూత్పూర్ 2.8, హన్వాడ 2.5, చిన్న చింతకుంట 1.0 మిల్లీమీటర్ల వర్షం రికార్డయింది.

దేశ రాజధాని దిల్లీలో సోమవారం బీజేపీ సీనియర్ ఎంపీలు సమావేశమయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో MBNR ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి దిల్లీ వెళ్లిన ఆమె, పలు కీలక అంశాలపై ఎంపీలతో చర్చించారు.

ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడమే తమ లక్ష్యమని ఎస్పీ జానకి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 12 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.