India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మండలంలోని యన్మన్‌గండ్లకు చెందిన జగదీశ్ (28) బుధవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఓ రైతు పొలంలోకి నర్సరీ చెట్లను తీసుకెళ్తుండగా కంచెలోని విద్యుత్ వైర్లను తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తూ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడితో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. జగదీశ్ బులెరో నడుపుతూ జీవనం సాగించేవాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో కమనీయంగా జరిగింది. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి గిరులు “కురుమూర్తి వాసా గోవింద” నామ స్మరణతో మార్మోగాయి.

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు కోనేరు వద్ద ఉన్న కళ్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన ఏర్పాట్లు సహా తదితర ముఖ్య అంశాలపై సమీక్షించనున్నారు.

పాలమూరు వర్శిటీ పేరు దేశవ్యాప్తంగా వినిపించేలా పథకాలు సాధించాలని వర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆర్చరీ పురుషుల జట్టుకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. సౌత్ జోన్(ఆల్ ఇండియా ఇంటర్ వర్శిటీ) టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆర్చరీ జట్టు గురుకాసి వర్శిటీ పంజాబ్‌కు బయలుదేరారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, అసోసియేట్ ప్రొ.డాక్టర్ ఎన్.కిషోర్,PD శ్రీనివాసులు పాల్గొన్నారు.

నవాబుపేట మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవాలయ సమీపంలో రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళుతూ.. ఓ వ్యక్తి కిందపడ్డాడు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయాల పాలైన ఆ వ్యక్తి ఆచూకీ తెలిస్తే.. 8712659340 సమాచారం ఇవ్వాలని ఎస్సై విక్రం మంగళవారం తెలిపారు.

కురుమూర్తి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సమర్పించేందుకు పట్టు వస్త్రాలు సిద్ధమవుతున్నాయి. ఉత్సవాల్లో రెండో ఘట్టమైన అలంకరణ ఉత్సవం రోజున ఈ వస్త్రాలు స్వామివారికి సమర్పించనున్నారు. ఆనవాయితీగా అమరచింత చేనేత కళాకారులు పట్టు వస్త్రాలను సమర్పించడం 66 ఏళ్లుగా కొనసాగుతోంది. అప్పట్లో గ్రామానికి చెందిన కొంగరి చెన్నయ్య అనే వ్యక్తి స్వామికి పట్టు వస్త్రాల మొక్కుబడి ఇప్పటికి ఉంటడం విశేషం.

@మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా దీపావళి సంబరాలు.
@రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లిలో టిప్పర్ ఢీకొని.. లారీ డ్రైవర్ మృతి.
@కౌకుంట్లలో ముగిసిన సదర్ ఉత్సవాలు.
@జడ్చర్లలో పిచ్చికుక్కల దాడి.. చిన్నారులకు గాయాలు.
@జాతీయస్థాయి SGF అండర్-17 వాలీబాల్ పోటీలకు నవాబుపేట యన్మంగండ్ల చెందిన జైనుద్దీన్ ఎంపిక.
@కురుమూర్తి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
@మిడ్జిల్ రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు.

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పండుగకు కొన్ని కీలక మార్గదర్శకాలు చేశారు. లైసెన్స్ పొందిన విక్రేతల వద్ద మాత్రమే బాణసంచా కొనాలని, బహిరంగ ప్రదేశాలలోనే కాల్చాలని సూచించారు. మండే పదార్థాలకు దూరంగా ఉండాలని, సింథటిక్ కాకుండా కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు. పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పటాకులు కాల్చాలని సూచించారు.

చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపురం గ్రామ సమీపంలో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయంలో అమావాస్య, శని, సోమవారాలను పురస్కరించుకొని భక్తులు సమర్పించిన హుండీ డబ్బులను శనివారం ఆలయ సిబ్బంది లెక్కించారు. హుండీ ద్వారా రూ.4,48,248 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ దగ్గర శనివారం బీసీ ఉమ్మడి జిల్లా జేఏసీ ఛైర్మన్ బెక్కం జనార్దన్, వివిధ సంఘాల నాయకులు బీసీ బంద్‌ను నిర్వహించారు. జేఏసీ ఛైర్మన్ మాట్లాడుతూ.. బీసీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తీసుకొచ్చి 42% బీసీ బిల్లు అమలు చేస్తూ, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జలజం రమేష్, ప్రభాకర్, శ్రీనివాసులు, రామ్మోహన్ జి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.