India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం నిర్వహించారు. బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేతలు మాట్లాడుతూ.. బీసీ హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తైంది. ఈ ఏడాదిలో వర్శిటీ విద్యా, పరిపాలనా రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. వీసీ బాధ్యతలు చేపట్టిన వెంటనే నాక్ (NAAC) గ్రేడింగ్‌కు వెళ్లడం, లా కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజీలను స్థాపించడం వంటి కీలక చర్యలు చేపట్టారు. ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఏడాది 100% అడ్మిషన్లు జరిగాయి.

దేవరకద్ర నియోజకవర్గం కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థులు ఒక్కొక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలి పీయూ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. పీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదాన వేడుక మాత్రమే కాదు, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర సందర్భం. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని’ సూచించారు.

పీయూలో ఇంజినీరింగ్ కళాశాల,లా కళాశాల, కొత్త హాస్టళ్లు, పరిశోధన కేంద్రాలు వంటి ప్రాజెక్టులు రూ.100 కోట్ల PM–USHA పథకం కింద వేగంగా అభివృద్ధి చెందుతుందని వీసీ ఆచార్య డాక్టర్ జిఎన్.శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఐదు క్యాంపస్ కళాశాలలు, 3 పీజీ సెంటర్లు, 24 కోర్సులు కొనసాగుతున్నాయని, NSS, క్రీడా, పర్యావరణ, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని’ ప్రశంసించారు.

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది.
కలెక్టరేట్ ప్రాంగణంలో గవర్నర్ మొక్క నాటి, నీళ్లు పోశారు. ఈ సమావేశంలో టీబీ నియంత్రణ చర్యలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు, అలాగే సామాజిక సేవా కార్యక్రమాల సమన్వయం వంటి ముఖ్య అంశాలపై చర్చించారు.

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం శివారులోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ మేరకు శ్రీ కురుమూర్తి దేవస్థాన ఛైర్మన్ జి.గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఆహ్వన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పాలమూరు యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన 4వ కాన్వకేషన్ (స్నాతకోత్సవం) కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, వీసీ శ్రీనివాస్ ఉన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా నవాబుపేట(M) గురుకుంటకి చెందిన పారిశ్రామికవేత డాక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డి (MSN)కి పాలమూరు యూనివర్సిటీ మొట్టమొదటి గౌరవ డాక్టరేట్ నేడు గవర్నర్ చేతి మీదగా ప్రదానం చేయనుంది. ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు స్థాపించారు. ప్రస్తుతం ఛైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ సాధించారు. #CONGRATULATIONS

పాలమూరు యూనివర్సిటీలో లైబ్రరీ ఆడిటోరియంలో రేపు 4వ స్నాతకోత్సవానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరు అవుతున్నందున జిల్లా ఎస్పీ డి.జానకి యూనివర్సిటీని ఈరోజు సందర్శించి సమావేశమయ్యే భవనాన్ని పరిశీలించారు. అనంతరం యూనివర్సిటీ అధికారులతో క్యాంపస్ అంతర్గత రోడ్డు మార్గం, వెహికల్ పార్కింగ్ మొదలైన విషయాల గురించి తెలుసుకున్నారు. రిజిస్ట్రార్ ప్రొ.పి.రమేశ్ బాబు, కంట్రోలర్ డా.కె.ప్రవీణ, డా.కుమారస్వామి ఉన్నారు.
Sorry, no posts matched your criteria.