Medak

News September 16, 2025

రేపటి నుంచి మహిళలకు ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

image

మహిళలకు మెరుగైన ఆరోగ్య సేవలకై స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం రేపటి నుంచి అక్టోబర్ 2వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 65 హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపులలో మహిళలకు బీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు, రక్తహీనత స్క్రీనింగ్ చేయనున్నారు.

News September 15, 2025

మెదక్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు పక్కాగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. మెదక్ బాలికల హై స్కూల్లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెల 22 నుంచి 28 వరకు ఈ పరీక్షలు 6 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.

News September 15, 2025

మెదక్: ప్రజా పాలన ఉత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి వివేక్

image

ఈనెల 17న నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఉత్సవంలో ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నారు. మెదక్‌లో జరిగే కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 15, 2025

మెదక్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌గా కృష్ణమూర్తి బాధ్యతలు

image

మెదక్ జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) ఇన్‌స్పెక్టర్‌గా ఎం. కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు బాధ్యతలుగా టాస్క్ ఫోర్స్ ఇన్‌ఛార్జ్‌గా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించారు.

News September 14, 2025

మెదక్: లోక్ అదాలత్‌లో 2,446 పోలీస్ కేసుల పరిష్కారం: ఎస్పీ

image

జిల్లాలో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 2,446 పోలీసు కేసులు రాజీ కుదిరినట్లు జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాసరావు తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు లోక్ అదాలత్‌లో 106 సైబర్ క్రైమ్ కేసులలో రూ. 24,19,680 బాధితుల ఖాతాల్లో జమ చేయడానికి బ్యాంకు నోడల్ అధికారులకు ఆర్డర్ కాపీలు పంపించడం జరిగినట్లు వివరించారు.

News September 13, 2025

మెదక్: లోక్ ఆదాలత్‌లో 4,987 కేసుల పరిష్కారం: ప్రధాన న్యాయమూర్తి

image

జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 4,987 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ తెలిపారు. మెదక్, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో ఏర్పాటు చేసిన ఏడు బెంచ్‌ల ద్వారా ఈ కేసులను పరిష్కరించారని, వీటి విలువ రూ.1,04,88,964 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శుభవల్లి, ప్రిన్సిపల్ జడ్జిలు సిరి సౌజన్య, సాయి ప్రభాకర్ పాల్గొన్నారు.

News September 13, 2025

మెదక్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్

image

మెదక్ జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ నీలిమ సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ ఎం.శుభవల్లి పర్యవేక్షించారు. రాజీ మార్గమే రాజమర్గమన్నారు. ఈ సందర్బంగా పలువురు తమ కేసుల్లో రాజీ పడ్డారు. న్యాయమూర్తులు సిరి సౌజన్య, సాయి ప్రభాకర్, స్వాతి, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

News September 13, 2025

మెదక్: తైబజార్ వసూళ్లు రద్దుకు ఆదేశం

image

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మెదక్‌లో గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో తైబజార్ రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాలని డీఎస్పీకి సూచించారు.

News September 13, 2025

రాష్ట్ర కళా ఉత్సవ్‌కు మెదక్ జిల్లా విద్యార్థులు ఎంపిక

image

రాష్ట్ర స్థాయిలో జరిగే కళా ఉత్సవ్-2025 పోటీలకు మెదక్ జిల్లా నుంచి పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని డీఈఓ రాధా కిషన్ తెలిపారు. వ్యక్తిగత విభాగంలో ఎస్. కౌడిపల్లి, బాలాజీ, శ్రీహర్షిని, ఆర్తిచంద్ర, సాత్విక్ ఎంపిక కాగా, బృందంలో స్పందన, మహేష్, కావేరి, సుర్తిత్రిక, పవన్ ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. వీరిని డీఈఓ , పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

News September 12, 2025

పెద్ద శంకరంపేట : మనస్థాపంతో బావిలో దూకి యువకుడి మృతి

image

పెద్ద శంకరంపేట మండలంలోని ముసపేటకి చెందిన గంగమేశ్వర్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిఅతడు తిరిగి రాలేదు. గంగమేశ్వర్ ఇటీవల ఓ కేసులో జైలుకు వెళ్ళి పది రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మనస్థాపంతోనే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.