India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి FLN, TLM బోధన అభ్యసన మేళాను కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ప్రారంభించారు. ఉపాధ్యాయుల సృజనాత్మకతను ప్రోత్సహించడం, తరగతి గదుల్లో బోధనా నాణ్యతను మెరుగుపరచడం కోసమే బోధన అభ్యసన మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేళాలో 21 మండలాల నుంచి 1-5 తరగతుల ఉపాధ్యాయులు పాల్గొనగా ఎనిమిది మంది టీచర్స్ రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికయ్యారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న కళానైపుణ్యతను వెలికితీయడానికే ఉద్దేశంతోనే కళా ఉత్సవ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (డీఈవో) ప్రొఫెసర్ రాధాకిషన్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కళా ఉత్సవ్ ప్రారంభించారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులలో కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు కళా ఉత్సవ్ పోటీలు ఉపయోగ పడతాయని పేర్కొన్నారు.

తూప్రాన్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. మనోహరాబాద్ మండల పర్యటనకు విచ్చేసిన కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించి, రోగులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూపరింటెండెంట్ అమర్ సింగ్‌కు సూచించారు.

ప్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్య విద్యాలయం నిర్వహించిన 2025-26 అగ్రిసెట్ ఫలితాలలో పెద్ద శంకరంపేటకు చెందిన ప్రజ్ఞ శ్రీ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించింది. మంగళవారం బీఎస్సీ అగ్రికల్చర్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ వచ్చిందని ప్రజ్ఞ పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఈ ర్యాంకు సాధించినట్లు ఆనందం వ్యక్తం చేసింది.

మెదక్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో క్రికెట్ మైదానం ఏర్పాటు పనులకు బుధవారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో కీలకమన్నారు. పోలీసు శాఖలోని యువ సిబ్బంది ప్రతిభను వెలికితీయడానికి, క్రీడా పోటీలను నిర్వహించేందుకు క్రికెట్ మైదానం ఉపయోగపడుతుందన్నారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మెదక్ కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి జరిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

చేగుంట మండలం చిటోజిపల్లికి చెందిన తలారి గోవర్ధన్(32) అనే యువ రైతు పొలంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య తలారి స్వప్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పిల్లలను ఆసుపత్రిలో చూపించడానికి వెళ్లిన తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నారాయణపూర్‌కు చెందిన వివాహిత తన ఇద్దరు పిల్లలను మంగళవారం ఆస్పత్రిలో చూపించడానికి వెళ్లి కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాకవి కాళోజి నారాయణరావు సేవలు చిరస్మరణీయమని డీఆర్ఓ భుజంగరావు అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ వ్యక్తిత్వం, రచనలు ప్రజలను చైతన్య పరిచాయన్నారు. ఆయన చూపిన దారిని విడవొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో యూనస్, అధికారులు పాల్గొన్నారు.

జాతీయ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మెదక్ ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ తెలంగాణకు కవిత్వం ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహానుభావులని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్ చంద్ర బోస్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.