Medak

News March 17, 2025

మెదక్: నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి: కలెక్టర్

image

వేసవిలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యుత్తు శాఖ అధికారులకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మంబోజి పల్లి ఏరియాలో 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా ఇన్ పుట్, ఔట్ పుట్ గురించి, ట్రాన్స్ ఫార్మర్లు, ఫీడర్ల గురించి విద్యుత్ శాఖ ఎస్ఈ శంకరును అడిగి తెలుసుకున్నారు.

News March 16, 2025

గజ్వేల్: మొదటి ప్రయత్నంలో గ్రూప్-3లో సత్తా

image

గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి దినేశ్ మెుదటి ప్రయత్నంలోనే గ్రూప్-3లో మెరిశాడు. కాగా దినేశ్ తండ్రి 2020లో అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత మూడు నెలలకే తల్లి రోడ్డు ప్రమాదంలో గాయాపడ్డి కోమాలోకి వెళ్లి మంచానికే పరిమితమైంది. అయినప్పటికీ కష్టపడి దినేశ్ కేవలం ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే వింటూ..అమ్మను చూసుకుంటూ గ్రూప్-3లో 80వ ర్యాంకు సాధించాడు. దీంతో అతన్ని గ్రామస్థులు అభినందిస్తున్నారు.

News March 16, 2025

గ్రూప్-1, 2లో సత్తా చాటిన ఉపాధ్యాయుడికి కలెక్టర్ సన్మానం

image

గ్రూప్-1, 2లో మంచి ర్యాంకులు సాధించి జూనియర్ లెక్చరర్‌గా ఎంపికైన GOVT టీచర్ మనోహర్ రావును కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందించి శాలువాతో సత్కరించారు. కుల్చారం మండలం అంసాన్పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా చేస్తున్న మనోహర్ రావు ఇటీవల ప్రకటించిన గ్రూప్ -2 పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఆలాగే గ్రూప్ -1లో మంచి ర్యాంకుతో పాటు జెఎల్ ఉద్యోగానికి ఎంపికై నియామకమాయ్యారు.

News March 16, 2025

ఇందిరమ్మ మోడల్ ఇంటి పనులు పరిశీలించిన కలెక్టర్

image

మెదక్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజ్  పరిశీలించారు. పనుల పురోగతిని అంచనా వేశారు. 45 రోజులలో పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ మోడల్ హౌసింగ్ పథకం ద్వారా పేదలకు మంచి గృహాలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు.

News March 16, 2025

విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే: కలెక్టర్

image

మెదక్ పట్టణంలో గిరిజన మినీ గురుకులాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇక్కడ పరిశుభ్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థుల శ్రేయస్సు, బోధనా సామర్థ్యాలు, ఆహార భద్రత, తదితరాల వంటి వాటిని పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని తెలిపారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమై వారి విద్యా ప్రతిభను పరీక్షించి పలు సూచనలు చేశారు.

News March 16, 2025

TB పేషెంట్స్‌కు ఉచితంగా పౌష్టికాహారం: మంత్రి దామోదర్ 

image

తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో TB పేషెంట్లకు ఫుడ్ కిట్లను అందించేందుకు అసోసియేషన్ తరపున రూ.25 లక్షల(CSR)నిధులను మంత్రి దామోదర్ రాజనర్సింహ కలిసి అందజేశారు. తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అందించిన CSR నిధులను టీబీ పేషెంట్లకు 6 నెలల పాటు ఉచితంగా పౌష్టికాహారం అందించేందుకు ఖర్చు పెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శి డా. క్రిస్టినా పాల్గొన్నారు.

News March 16, 2025

రాజకీయ పార్టీలతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశం

image

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశం నిర్వహించారు. నూతన ఓటరుగా నమోదు చేసుకున్న ఫారమ్ 6, 7, 8లను పరిశీలించి పూర్తి చేయాలని పేర్కొన్నారు. బిఎల్ఏలు, గ్రామ స్థాయి అధికారులు దరఖాస్తులను పెండింగ్‌లో లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎంల మీద సందేహాలను నివృత్తి చేయడం జరిగిందని తెలిపారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల నివేదికలు త్వరగా అందించాలన్నారు.

News March 15, 2025

నర్సాపూర్: నాటు తుపాకులతో తిరుగుతున్న 8 మంది అరెస్ట్

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నాయపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటకు నాటు తుపాకీలతో తిరుగుతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిపై పోలీసు కేసు నమోదైంది. అరెస్టయిన వారిలో యాసిన్, శ్రీకాంత్, కృష్ణ, శంకరయ్య, వీరాస్వామి, పోచయ్య, విజయ్, భాను ప్రసాద్ ఉన్నారు. వారిని కోర్టులో హాజరు పరిచారు.

News March 15, 2025

మెదక్: ఒక్కరోజు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్

image

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో హెర్బేరియం తయారీ, నిలువ చేయు విధానం అనే అంశంపై ఒక్కరోజు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. హుస్సేన్ తెలిపారు. రాష్ట్రీయ ఉచిత ఉచితార్ శిక్షాభియన్ వారి ఆర్థిక సహకారంతో ఈ కార్యశాలకు సంబంధించిన ప్రచార పత్రాన్ని కళాశాలలో ఆవిష్కరణ చేశారు. 

News March 15, 2025

మెదక్: రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డీఓ సమావేశం

image

మెదక్ ఆర్డీవో రమాదేవి తన కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఫారం-6, 8ల గురించి రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితా నిరంతర నమోదు, బూత్ స్థాయి ప్రతినిధుల నియామకం గురించి చర్చించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు. తహసీల్దార్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!