India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వ్యాధుల నిర్మూలన కోసం ఐదు రోజులపాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అంగన్వాడీ, పంచాయతీ భవన సముదాయాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. విధులు సరిగా నిర్వర్తించని వారిపైచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనుమానాస్పదంగా వివాహేత మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేటలో మంగళవారం జరిగింది. ఎస్సై నారాయణ తెలిపిన వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన వానరాశి రాధిక(19) ఇంట్లో అనుమానాస్పదంగా ఉరేసుకుంది. స్థానికుల సమచారంతో 108 సిబ్బంది మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి అమ్మమ్మ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఎస్సై తెలిపారు.

భవిష్యత్తులో జిల్లాలో భారీ విపత్తులను అధిగమించే విధంగా శాశ్వత పరిష్కారం దిశగా నిర్మాణాలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం చేగుంట మండల కేంద్రంలో అనంతసాగర్లో వర్షాల తాకిడికి దెబ్బతిన్న ఇళ్లను, ఇబ్రహీంపూర్లో తెగిన రోడ్డు, ఇతర నష్టం వాటిల్లగా సంబంధిత రెవెన్యూ, పంచాయతీరాజ్, హౌసింగ్ అధికారులతో పర్యటించారు.

మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి దామోదర్ రెడ్డి మేడ్చల్ జిల్లాకు బదిలీ అయ్యారు. గతేడాది జులైలో బదిలీపై రాగా ఇప్పటి వరకు విధులు నిర్వహించారు. దామోదర్ రెడ్డి బదిలీ కాగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్కు డీవైఎస్ఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇన్ఛార్జ్ మెదక్ డీఈఓగా ఉన్న ప్రొ.రాధాకిషన్ కు డైట్ ప్రిన్సిపల్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. తాజాగా డీవైఎస్ఓగా బాధ్యతలు అప్పగించారు.

ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించేదుకు ముందుకు వెళ్తుంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తుది జాబితా విడుదల చేసింది. 9న అభ్యంతరాల స్వీకారణ, 10న తుది జాబితా తర్వాత సర్పచ్ ఎన్నికలు నిర్వహించనుంది. జిల్లా వ్యాప్తంగా 21 మండలలు, 492 గ్రామ పంచాయతీలు, 5,23,327 ఓటర్లు, 190 ఎంపీటీసీ, 21 జడ్పీటీసీలు, బూత్లు 1052 ఉన్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూపిన ఎన్నికలపై ముచ్చటిస్తున్నారు.

CEIR పోర్టల్ ద్వారా రూ.25 లక్షల విలువగల 167 మొబైల్ ఫోన్లు రికవరి చేసి బాధితులకు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అందజేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ.1.89 కోట్ల విలువ గల మొత్తం 1264 ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఫోన్లు తిరిగి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.

భారీ వర్షాలు, వరద సహాయం పై సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్ వీసీలో పాల్గొన్నారు. వరద నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని, నష్టం అంచనాలను అధికారులు త్వరిత గతిన అందజేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు.

మెదక్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొమ్మిది ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదుల సమస్యలను విని వాటికి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు

మెదక్ జిల్లాలో వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అంతటా ఉన్న అన్ని పోలీస్ అధికారులు, సీఐలు, ఎస్ఐలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అన్నారు.

మెదక్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నెల 1 నుంచి 30 వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కాలంలో జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషేధమని హెచ్చరించారు. ఈ నిబంధనలకు సహకరించాలని ఆయన ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులను కోరారు.
Sorry, no posts matched your criteria.