Medak

News August 9, 2025

మెదక్ జిల్లాలో వర్షపాతం అప్డేట్..!

image

మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నర్సాపూర్‌లోని చిప్పలతుర్తి 65.5, కాగజ్ మద్దుర్ 8.3, నర్సాపూర్ 34.8, చేగుంట 41.8, శివ్వంపేటలో కొత్తపేట 36.3, శివ్వంపేట 24.3, వెల్దుర్తి 34.8, రామాయంపేట 23.3, మెదక్ 22.3, మాసాయిపేట 19.5, మనోహరాబాద్ 18.5, అల్లాదుర్గ్ 4.0, టేక్మాల్ 3.3, కుల్చారం 0.8 మిమీ వర్షపాతం నమోదైంది.

News August 9, 2025

MDK: ఇంటర్ అడ్మిషన్ల గడువు 31 వరకు పెంపు

image

మెదక్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ అధికారి మాధవి తెలిపారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రవేశం పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదే చివరి అవకాశం అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలని స్పష్టం చేశారు.

News August 8, 2025

మెదక్: సంతోషం, ఐక్యత తీసుకురావాలి: ఎస్పీ

image

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మెదక్ జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అక్కచెల్లెళ్లు, అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని, రక్షణను, ప్రేమను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ పర్వదినం ప్రతి కుటుంబానికీ సంతోషం, ఐక్యత, ఆనందం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

News August 8, 2025

MDK: ఏడుపాయలలో వైభవంగా వన దుర్గమ్మ పల్లకీ సేవ

image

ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత సన్నిధిలో పౌర్ణమి పురస్కరించుకొని శుక్రవారం రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు చేశారు. ఆలయం నుంచి ప్రారంభమైన పల్లకిసేవ శివాలయం మీదుగా కొనసాగి రాజగోపురం గుండా ఆలయం వరకు చేరుకోగా భక్తులు పల్లకిసేవలో పాల్గొని తరించిపోయారు.

News August 8, 2025

మెదక్: ‘పునరావాసంపై భరోసా మరింత దృష్టి పెట్టాలి’

image

పునరావాసంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ భరోసా కేంద్రం నిర్వాహకులకు సూచించారు. మెదక్ భరోసా సెంటర్ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా కేక్ కట్ చేశారు. అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి తదితరులు హాజరయ్యారు. పిల్లలపై లైంగిక దాడుల నివారణ, బాధితుల పునరావాసంపై విలువైన చర్చించారు.

News August 6, 2025

స్వాతంత్య్ర దినోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు: కలెక్టర్

image

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్
రాహుల్ రాజ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్ కార్యాలయంలో యధావిథిగా జెండా వందనం ఉంటుందని, ముఖ్యమైన కార్యక్రమం పరేడ్ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరణ, ముఖ్య అతిథి సందేశం ఉంటుందన్నారు. అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు ఉన్నారు.

News August 6, 2025

రెవెన్యూ సదస్సు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి: RDO

image

రామాయంపేట తహశీల్దార్ కార్యాలయాన్ని బుధవారం మెదక్ ఆర్టీవో రమాదేవి ఆకస్మికంగా సందర్శించారు. భూభారతి రెవిన్యూ సదస్సులో రైతులు అందజేసిన ఫిర్యాదులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో అందించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రజనీకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

News August 5, 2025

మెదక్: ‘కళాశాలలో దరఖాస్తు చేసుకోండి’

image

మెదక్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సియస్ఈ) డిప్లొమా కోర్సులు ఉన్నట్లు ప్రిన్సిపల్ భవాని తెలిపారు. ఈనెల 5 నుంచి 10 వరకు స్పాట్ అడ్మిషన్ దరఖాస్తులు స్వీకరించబడునన్నారు. ఈనెల 11న ఉ.10 గం.లకు స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

News July 11, 2025

మెదక్: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ల బడ్జెట్ విడుదల

image

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న గుడ్లకు బడ్జెట్ విడుదలైందని DEO రాధా కిషన్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. జిల్లాకు రూ.26,97,786 విడుదల చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే సంబంధించిన ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు.

News July 11, 2025

రాబోయే తరాల కోసం కృషి చేయాలి: డీఈవో

image

రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఈవో డాక్టర్ రాధా కిషన్ పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.