India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా సివిల్ జ్యుడీషియల్ జడ్జి లక్ష్మి శారద చేతుల మీదుగా చిన్నశంకరంపేట మం. మడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని అంకిత సన్మానం అందుకున్నారు. వారణాసిలో జరిగిన జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న అంకిత ప్రతిభను గుర్తించి ఈ సన్మానం చేసినట్టు పాఠశాల HM రవీందర్ రెడ్డి, పీడీ నరేశ్ తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళాభివృద్ధి, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర్ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రుల నివాసంలో ప్రైవేటు ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వీట్లు పంపిణీ చేశారు. మహిళలకు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
డిసెంబర్-2024లో జరిగిన డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిందని, పాఠశాల విద్యాశాఖ అధికారులు శనివారం తెలిపారు. ఈ ఫలితాల కొరకు https://bse.telangana.gov .in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. రీకౌంటింగ్‌కు ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పంచాయతీ రాజ్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి ఈఈగా ఉన్న జగదీశ్వర్‌కు మెదక్ ఇన్చార్జ్ ఎస్ఈగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. తాజాగా ప్రభుత్వం ప్రమోషన్ ఇస్తూ మెదక్ జిల్లా పంచాయతీ రాజ్ సర్కిల్ ఎస్ఈగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. మెదక్ ఈఈ నర్సింలు, డిఈ పాండురంగారెడ్డితో పాటు, ఇతర డిఈ, ఏఈలు పుష్పగుచ్చం అందజేశారు.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్త్రీశక్తిని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైనదన్నారు. దేశ సంపదను సృష్టించడంలో వారి పాత్ర గొప్పదన్నారు. ఎన్నో కష్టాలను అధిగమిస్తూ పురుషుడితో సమానంగా నేటి సమాజంలో స్త్రీ పోశిస్తున్న పాత్ర అమోఘమని తెలిపారు. అవకాశాలిస్తే అబల సబలగా నిరూపించుకుంటుందన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సోదరీమణులను సన్మానించి యావత్ స్త్రీలందరికీ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీలకు పురుషులతో పాటు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. స్త్రీలు వెనుకబాటు తనానికి గురికాకుండా జీవితంలో స్థిరపడాలని తెలిపారు.
మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. వివరాలు.. మెదక్‌లో రెండు బైకులు ఢీకొనడంతో కిరణ్ (26) మృతి చందగా.. హవేళి ఘనపూర్‌లో శ్మశాన వాటిక కమాన్‌ను టిప్పర్ ఢీకొని కమాన్ పైకప్పు కూలడంతో మునవార్ (21) మరణించాడు. నర్సాపూర్ మండలంలో రామోజీ(50)ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలతో మృతి చెందాడు. శివ్వంపేటలో గుమ్మల శేఖర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సిద్దిపేట జిల్లా కుక్కునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధి చిన్న కిష్టాపూర్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపల్ డీఎస్పీ జవహర్ లాల్(50) చికిత్స పొందుతూ మృతిచెందారు. కార్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. జవహర్ లాల్ కారులో కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కారు అదుపు తప్పి ఇనుప బోర్డ్‌కు ఢీ కొట్టింది.
మండుటెండలు రాకముందే.. తెలంగాణ వ్యాప్తంగా తాగునీటి కష్టాలు మొదలైనట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం పడుతున్న కష్టం ఇది అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను సీఎం రేవంత్ రెడ్డి వల్ల మళ్లీ చూస్తున్నామని మండిపడ్డారు.
రేపు మెదక్ జిల్లా కోర్టులో నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివాదాలు ఒకసారి ప్రారంభమైతే, జీవితాంతం కొనసాగుతుంటాయని అన్నారు. వాటిని త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంటే, శాంతి సాధ్యమవుతుందన్నారు. రాజీమార్గమే రాజమార్గం అనే సూత్రాన్ని అనుసరించి, వివాదాలను చక్కదిద్దుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.