Medak

News March 31, 2025

మెదక్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి

image

మెదక్ జిల్లాలోని గడిచినా 24 గంటల్లో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ 40.8, వెల్దుర్తి 40.7, మాసాయిపేట 40.6, కుల్చారం 40.5, కౌడిపల్లి, చేగుంట 40.4, శివ్వంపేట 40.3, పెద్ద శంకరంపేట్ 40.2, రేగోడ్, నిజాంపేట్ 40.1, అల్లాదుర్గ్ 39.8, నర్సాపూర్ 39.4, రామాయంపేట, టేక్మాల్ హవేలిఘనపూర్ 39.1 పాపాన్నపేట్ 39.0°, మనోహరాబాద్ 38.9 C, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 31, 2025

తూప్రాన్: గ్రూపు-1లో 17వ ర్యాంకు

image

తూప్రాన్ పట్టణానికి చెందిన బోయినిపల్లి ప్రణయ సాయి ఆదివారం ప్రకటించిన ర్యాంకుల్లో గ్రూపు -1లో 513 మార్కులతో రాష్ట్రస్థాయి 17వ ర్యాంకు సాధించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు విష్ణువర్ధన్, శ్రీవిద్య దంపతుల కుమారుడైన ప్రణయ్ సాయి గ్రూపు-lV ఫలితాల్లో 42 ర్యాంకు సాధించి చేగుంట రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్ -llలో 134, గ్రూపు -lllలో 148 ర్యాంకు సాధించాడు.

News March 31, 2025

మెదక్: గ్రూప్ -1లో 41వ ర్యాంక్ సాధించిన శైలేష్

image

టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ – 1 ఫలితాల్లో మెదక్ పట్టణానికి చెందిన పూనా శైలేష్ 41వ ర్యాంక్ సాధించాడు. నిన్న తుది ఫలితాలు ప్రకటించగా 503.500 మార్కులు వచ్చాయి. కాగా 1 నుంచి 7వ తరగతి వరకు మెదక్ శివ సాయి స్కూల్, 8 నుంచి 10 అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ తూప్రాన్, ఇంటర్ నారాయణ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్, డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీలో చదివాడు. కాగా, గ్రామస్థుల నుంచి శైలేష్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి.

News March 31, 2025

మాసాయిపేట: విద్యుత్ షాక్‌తో మృతి

image

మాసాయిపేట మండలంలో విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. మాసాయిపేటకు చెందిన గౌరవగల్లు నరసింహులు (42) స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి జారిపడ్డాడు. అదే సమయంలో వాటర్ హీటరు పెట్టిన బకెట్లో చేయ్యిపడి విద్యుత్ షాక్ తగిలింది. విద్యుదాఘాతం ఏర్పడి నరసింహులు అక్కడికక్కడే మృతి చెందినట్లు భార్య సంతోషి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News March 30, 2025

MDK: వన దుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్

image

ఉగాది పర్వదినం పురస్కరించుకొని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవాని మాతను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సకుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరి పేర వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగి సూర్య శ్రీనివాస్ జిల్లా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు.

News March 30, 2025

జహీరాబాద్‌లో మహిళ దారుణ హత్య

image

మహిళ దారుణహత్యకు గురైన ఘటన జహీరాబాద్ పట్టణం పస్తాపూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. మహిళ కళ్లల్లో కారం చల్లి దారుణ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు ఝరాసంగం మండలం చీల మామిడికి చెందిన లక్ష్మి (55)గా గుర్తించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సందర్శించి హత్యకు గల కారణాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు.

News March 30, 2025

మెదక్: ‘తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు’

image

మెదక్ జిల్లాలో నేటి నుంచి జూన్ 1 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ బోర్డు శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ అధికారి మాట్లాడుతూ.. సెలవులలో తరగతులు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 30, 2025

MDK: ‘25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి’

image

ఎల్ఆర్ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నవారు పూర్తిస్థాయిలో రుసుము చెల్లించి ప్లాట్‌ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 31లోపు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించిన వారికి ప్రభుత్వం 25% రాయితీని వర్తింపజేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 29, 2025

తుది శ్వాస వరకు కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేస్తా: శేరి సుభాష్ రెడ్డి

image

ఎమ్మెల్సీగా ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా శేరి సుభాష్ రెడ్డి శనివారం ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉద్యమ ఆరంభం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్న తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తుది శ్వాస వరకు కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేస్తానని సుభాష్ రెడ్డి అన్నారు.

News March 29, 2025

మెదక్ ప్రజలకు ఎస్పీ ఉగాది, రంజాన్ విషెస్

image

మెదక్ జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులకు తెలుగు సంవత్సరాది ఉగాది, రంజాన్ పండగ శుభాకాంక్షలను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో తీపి చేదు షడ్రుచుల కలగలిపి ఆస్వాదిస్తూ శాంతి సౌభాగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగ, ముస్లింలు పవిత్ర మాసం రంజాన్ పండగలు ఏకకాలంలో వస్తున్నందున కులమతాలు వేరైనా మనమందరం భారతీయులమన్న విషయం మర్చిపోవద్దన్నారు.