India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లాలో గత నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు పూర్తి కావడంతో సోమవారం నుంచి అన్ని ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. డీఐఈఓ మాట్లాడుతూ.. కళాశాలలో పరిసరాలను పరిశుభ్రం చేసిన తర్వాతనే విద్యార్థులను తరగతి గదులలో కూర్చోబెట్టాలని కళాశాలల ప్రిన్సిపాల్‌లకు ఆదేశించారు. విద్యార్థులు హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత క్షేత్రంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ పల్లకి సేవా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని కోరారు.
జిల్లాలో మద్యం దుకాణాలకు ఆరు దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మెదక్ పరిధి పోతంశెట్టిపల్లి (15వ దుకాణం) 3 దరఖాస్తులు, పాపన్నపేట (10) ఒక దరఖాస్తు, రామాయంపేట పరిధి మాసాయిపేట (42) ఒకటి, నార్సింగి (43) ఒక దరఖాస్తురాగా మొత్తం 6 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఈనెల 18 వరకు పని దినాలలో ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలు, గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఒకవైపు 8న హైకోర్ట్ ఏం తీర్పు ఇవ్వనుందని, మరోకవైపు ఈసారి పల్లెల్లో త్రిముఖ పోరు ఉండడంతో ఓట్లు చీలిక ఏ విధంగా ఉంటుందోనని ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఓటర్ల నాడి ఎటు ఉందో చూడాలి మరి. మీరి మీ ప్రాంతంలో ఏవిధంగా ఉంది కామెంట్.
రామాయంపేట జడ్పీటీసీ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో రామాయంపేటను జనరల్‌గా రిజర్వేషన్ ప్రకటించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కూడా జనరల్ కావడంతో రామాయంపేటలో పోటీ రసవత్తరంగా మారునుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి హేమాహేమీలు బరిలో ఉండే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది.
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో బైక్ దొంగిలిస్తున్న యేవాన్, మహిపాల్‌లను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఆగ్రహంతో వారి జేబులోని పెట్రోల్‌తో ఒకరిపై నిప్పంటించారు. మంటలు ఆర్పిన పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యేవాన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, మరొ దొంగ మహిపాల్‌పై ఇది వరకు పోక్సో కేసు ఉందని పోలీసులు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నమైనందున, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంటూ, ప్రజలు గమనించాలని సూచించారు.
నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ శ్రీ భద్రకాళి ఉత్సవ కమిటీ మీదిగడ్డ వారి 4వ వార్షికోత్సవంలో భాగంగా కమిటీ సభ్యులు లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. ఈ లక్కీ డ్రాలో మొదటి బహుమతి నందిగామకు చెందిన టంకరి నవీన్ తులం బంగారం గెలుచుకున్నాడు. రెండో బహుమతి అమ్మవారి లడ్డును కాకి ప్రదీప్ కుమార్ గెలుచుకోగా, మూడో బహుమతి నాలాం విజయ్ అమ్మవారి పట్టుచీరను గెలుచుకున్నాడు. కమిటీ సభ్యులు వారికి సన్మానించి బహుమతులను అందించారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశిస్తూ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. అనుకున్న సమయం కంటే ముందే భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
మెదక్ నుంచి ముక్త భూపతిపూర్ వెళ్లే తాత్కాలిక బ్రిడ్జి రోడ్డు నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో వర్షాలు, వరదల కారణంగా బ్రిడ్జి దెబ్బతినడంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.