Medak

News April 13, 2026

మెదక్ జల్లాలో 18వ శతాబ్దపు తెలుగు శాసనం గుర్తింపు

image

మెదక్ జిల్లా వరిగుంతం గ్రామంలో బుర్ర సంతోష్ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనాన్ని గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ పరిశీలించి, ఇది ఎఱయప్రోలు పేరు మీద ఇచ్చిన దానం గురించి తెలుపుతుందని నిర్ధారించారు. గ్రామం యొక్క పురాతన చరిత్రకు నిదర్శనమైన ఇటువంటి శాసనాలను, విగ్రహాలను భావి తరాల కోసం ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

News April 13, 2026

తూప్రాన్: తల్లిదండ్రులకు విజయాన్ని అంకితం చేసిన శ్రావణి

image

తూప్రాన్ ఎంజేపీ బాలికల కళాశాల విద్యార్థిని శ్రావణి ఇంటర్ ఎంపీసీలో 950 మార్కులతో సత్తా చాటింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా.. పట్టుదలతో చదివి ఈ విజయం సాధించింది. టెన్త్ బోనాల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసిన శ్రావణి.. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంటర్‌లో రాణించింది. తన విజయాన్ని అమ్మానాన్నలకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని శ్రావణి పేర్కొంది.

News April 13, 2026

మెదక్: RJCలో 100% ఉత్తీర్ణత.. స్టేట్ టాపర్ శ్రావణి

image

మెదక్ TSRJC విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించారు. పరీక్షలకు హాజరైన మొత్తం 68 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో మన్నే శ్రావణి ఎంపీసీ విభాగంలో 992/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి టాపర్‌గా నిలిచింది. విద్యార్థుల అద్భుత ప్రతిభపై అధికారులు, టీచర్లు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ విద్యాలయాల ఖ్యాతిని శ్రావణి మరోసారి చాటిచెప్పింది.

News April 12, 2026

మెదక్: ఒకేషనల్ ఫస్టియర్ ఫలితాల్లో జిల్లా టాప్

image

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఒకేషనల్ ఫలితాల్లో మెదక్ జిల్లా టాపర్‌గా నిలిచినట్లు ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. 599 మంది పరీక్షకు హాజరుకాగా 73.46% గా 440 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. 289 మంది బాలురకు 59.17 శాతంగా 171 మంది ఉత్తీర్ణత సాధించారు. 310 మంది బాలికలకు 86.77 శాతంగా 269 మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్ సెకండియర్ RESULTS.. మెదక్ 26వ స్థానం

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. మెదక్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 4826 మంది పరీక్షలు రాయగా 3310 మంది పాసై 68.59 శాతంతో స్టేట్‌లోనే 26వ స్థానం వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 539 మందికి 460మంది పాసై 85.34 శాతంతో 3వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 649 మందికి 187 మంది పాసై 28.81%తో 28వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో16 మందికి 11 మంది పాసై 68.75%తో 1వ ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. స్టేట్‌లోనే మెదక్ 28 స్థానం

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మెదక్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 5710 మంది పరీక్ష రాయగా 3156 మంది పాసై 55.27 శాతంతో స్టేట్‌లోనే 28 ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 599 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 440 మంది విద్యార్థులు పాసై 73.46 శాతంతో స్టేట్‌లో 1వ స్థానంలో నిలిచింది.

News April 12, 2026

MDK: సాసర్ పిట్స్‌తో దాహం తీర్చుతున్న అటవీ శాఖ

image

మెదక్ జిల్లాలో ఎండల తీవ్రతతో అడవుల్లో వాగులు ఎండిపోవడంతో వన్యప్రాణులు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన ‘సాసర్ పిట్స్’ (సిమెంట్ కుంటలు) జంతువులకు ప్రాణాధారంగా మారాయి. కెమెరా ట్రాప్‌లలో చిరుతలు, జింకలు నీరు తాగుతున్న దృశ్యాలు నమోదవుతున్నాయి. ఈ కుంటలు జంతువులు గ్రామాల వైపు రాకుండా అడ్డుకుంటూ రక్షణ కల్పిస్తున్నాయి. అధికారులు నిరంతరం నీరు నింపుతూ పర్యవేక్షిస్తున్నారు.

News April 12, 2026

మెదక్‌: ప్రజావాణి కార్యక్రమం వాయిదా: కలెక్టర్

image

ఈ నెల 13న (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభల పనుల్లో అధికారులు నిమగ్నమై ఉండటంతో కలెక్టరేట్, మున్సిపాలిటీలు, తహశీల్దార్ కార్యాలయాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే స్వీకరిస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు.