India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లాలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా 88 మంది ఉత్తమ అధికారులు, పోలీస్, ప్రభుత్వ సిబ్బందిని ఎంపిక చేశారు. వీరికి ప్రశంసా పత్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ చేతులమీదుగా అందజేయనున్నారు. ప్రతి ఏటా ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో పనిచేసే వారిని ఎంపిక చేస్తారు.
వైద్యా, విద్య ప్రమాణాలు మెరుగుపడేలా మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. నూతనంగా నియమితులైన రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.
రేపు రామాయంపేట మున్సిపాలిటీలో మాంసం విక్రయాలు జరపొద్దని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. చికెన్, మటన్, చేపల మార్కెట్లు మూసివేయాలని సూచించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో మాంసం విక్రయాలు బంద్ ఉండనున్నాయి.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండాకు చెందిన గిరిజన విద్యార్థి జవహర్ లాల్ నాయక్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇటీవల ప్రకటించిన సెంట్రల్ వాటర్ కమిషన్‌లో జూనియర్ ఇంజినీర్‌గా సెలెక్ట్ కాగా, శుక్రవారం టీఎస్పీఎస్సీ ప్రకటించిన నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందారు. తమ తండాకు చెందిన యువకుడు రెండు ఉద్యోగాలు సాధించడం పట్ల తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఎయిర్టెల్ సిమ్ము వినియోగదారులకు గత కొన్ని రోజుల నుంచి సిగ్నల్ సరిగా అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఎయిర్టెల్ సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల గ్రామాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటర్నెట్ ఆన్ చేస్తే ఒక సైట్ ఓపెన్ కావడానికి 1 నిమిషం వరకు పడుతోందని యువకులు అంటున్నారు. airtel సిబ్బంది స్పందించలన్నారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు అధికంగా తగ్గాయి. గతంలో రూ.7.50గా పలికిన ఒక్క కోడి గుడ్డు ధర నేడు రూ.5.50లకు పడిపోయింది. ఒక ట్రే రూ.180 ఉండేది. రేట్లు తగ్గడంతో రూ.150కు ట్రే అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుడ్లపై మక్కువ ఉన్న ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ నుంచి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ అవగాహన ర్యాలీలో జిల్లా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీఓలు, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్లు, జర్నలిస్టులు, ప్రజలు, విద్యార్థుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.
ఇంటి నుంచి వెళ్లిన ఒక యువకుడు అదృశ్యమైన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాగి గణేశ్ ఈనెల 15న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇంటి వద్ద వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో భార్య శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ- ఆఫీస్ కార్యక్రమానికి శ్రీకారం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు పేపర్‌పై పని తగ్గించాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత కార్యాలయంగా తయారు చేసేందుకు కృషి చేయాలన్నారు. సంబంధిత కార్యాలయాల్లో విద్యుత్‌ను ఆదా చేసి ఈ- ఆఫీస్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖల ద్వారా శకటాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందించడానికి ఇవాళ వరకు జాబితా ఇవ్వాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.