Medak

News August 6, 2024

రామాయణపేట: ముక్కిపోయి, గడ్డలు కట్టిన రేషన్ బియ్యం సరఫరా !

image

రామాయంపేట మండల వ్యాప్తంగా ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌర సరఫరాల రేషన్ బియ్యం నాణ్యత దిగజారింది. మండలం పరిధి కాట్రియాల గ్రామంలోని ఒక రేషన్ షాపులో ముక్కిన బియ్యం సరఫరా చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముక్కిపోయి, గడ్డలు కట్టిన పురుగులు పట్టిన బియ్యం ఎలా తింటామంటూ నిలదీశారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News August 6, 2024

స్వచ్చదనం- పచ్చదనంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: పొన్నం

image

హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు వద్ద మంగళవారం స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మనుచౌదరి పాల్గొన్నారు. కొత్త చెరువును పరిశీలించి అక్కడ చేయాల్సిన పనులు, మరమ్మతులు తదితర అంశాలపై కలెక్టర్‌‌తో చర్చించారు. స్వచ్చదనం – పచ్చదనంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

News August 6, 2024

అమెరికాలో సిద్దిపేట యువకుడి అనుమానాస్పద మృతి

image

సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కూటిగల్‌ యువకుడు అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మంగవ్వ-మహదేవ్‌ కొడుకు సాయిరోహిత్(23) USలో ఎంఎస్ చేసేందుకు 2024లో వెళ్లాడు. జులై 22న ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోహిత్.. 24న సమానుష్‌ సరస్సులో ‌మృతదేహంగా తేలాడు. కుటుంబీకులకు ఈ విషయాన్ని స్నేహితులు చెప్పారు. నేడు స్వగ్రామానికి మృతదేహం రానుంది. కొడుకు మృతి విషయం తల్లికి తెలియదు.

News August 6, 2024

MDK: విజృంభిస్తోన్న సీజనల్ వ్యాధులు !

image

వాతావరణంలో మార్పులతో ఉమ్మడి జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పెద్దలు, పిల్లలు తేడా లేకుండా అనారోగ్యం బారిన పడుతున్నారు. జులై 8 నుంచి ఇంటింటికీ జ్వర సర్వే చేసి బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఎక్కువ మంది వ్యాధుల బారిన పడితే టోల్ ఫ్రీ నంబర్ 9494851165కు సమాచారం ఇవ్వాలన్నారు. సంగారెడ్డి జిల్లాలో 1.07లక్షల ఇళ్లలో సర్వే చేయగా 14,134 మంది వివిధ రకాల జ్వరాలతో బాధపడుతున్నట్లు తేలింది.

News August 6, 2024

జీవన్ దాన్‌లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ: రాజనర్సింహ

image

జీవన్ దాన్‌లో జాతీయస్థాయిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో అవయవదానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ చేతుల మీదుగా అవార్డు అందుకుందన్నారు. ఈ మేరకు హైదరాబాదులోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు.

News August 6, 2024

సిద్దిపేట: ‘ఉపాధి హామీ హక్కులను పరిరక్షించాలి’

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హక్కులను పరిరక్షించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి బృందానికి నరేగ సంఘర్షణ సమితి జాతీయ బృందం విన్నవించింది. సోమవారం డిల్లీలోని కృషిభవన్ లోని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆరుగురి అధికారులను ఆయా రాష్ట్రాలకు చెందిన దళిత, ప్రజా కార్మిక సంఘాల నాయకులు కలిశారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ.. జాబ్ కార్డుల తొలగింపు అన్యాయమన్నారు.

News August 5, 2024

MDK: ‘ఇంటింటా ఇన్నోవేటర్’ గడువు పొడిగింపు

image

తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటా ఇన్నోవేటర్-2024’ కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఎంట్రీలను సమర్పించేందుకు ఈనెల 10 వరకు గడువు పొడిగిస్తున్నట్లు చెప్పారు. సరికొత్త ఆవిష్కరణలు రూపొందించిన వారిని పరిచయం చేస్తూ వాటిని ఈనెల 15న ప్రదర్శిస్తామని వెల్లడించారు. వివరాలకు pr-tsic@telangana.gov.in వెబ్‌సైట్ చూడాలన్నారు.

News August 5, 2024

ట్రావెల్ బస్సులో చోరీ.. 3కిలోల బంగారం రికవరీ: ఎస్పీ రూపేశ్

image

సత్వర్ డాబా వద్ద ఓ ట్రావెల్ బస్సులో జరిగిన చోరీలో రూ.3.10 కోట్ల విలువ చేసే 3 కిలోల బంగారం రికవరీ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని దార్వాడ పూర్‌కు చెందిన ముస్తాక్(40)ని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు.

News August 5, 2024

మెదక్‌లో మెడికల్‌ కాలేజీ ఉన్నట్టా.. లేనట్టా..?

image

మెదక్‌ జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాలలో సరైన సౌకర్యాలు లేవని నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులకు నిరాకరించింది. దీంతో మెదక్‌లో మెడికల్‌ కళాశాల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ‌ గత ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ.180 కోట్ల నిధులు, 14 ఎకరాల భూమిని కేటాయించింది. సరైన సౌకర్యాలు లేవన్న కారణంతో ఎన్‌ఎంసీ అనుమతి నిరాకరించగా, ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. మెడికల్ కాలేజీ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది.

News August 5, 2024

దుబ్బాక: న్యాయం జీవితకాలం ఆలస్యం

image

సిద్దిపేట(D) దుబ్బాక(M) పెద్దగుండవెళ్లికి చెందిన ఎల్లవ్వ(80) 2013 ఫిబ్రవరి 1న ఇంటి పక్కనే ఉన్న చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు. పోలీసులు ఎల్లవ్వది హత్యగా భావించి ఆమె కొడుకు పోశయ్యను అరెస్టు చేశారు. 2015లో సిద్దిపేట కోర్టు పొశయ్యకు యావజ్జీవ శిక్ష విధించగా, పోశయ్య హైకోర్టును ఆశ్రయించారు. జైలులో శిక్ష అనుభవిస్తూ ఆగస్టు 14, 2018లో మృతిచెందారు. ఆధారాలు లేవని కొట్టివేయగా పోశయ్య నిర్దోషిగా తేలాడు.