Medak

News January 27, 2025

మెదక్: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

అనుమానస్పదంగా బావిలో మృతదేహం లభ్యమైన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అప్పాజీపల్లికి చెందిన రాములు(45) నడిమి తండాకు చెందిన ఓ వ్యక్తి వద్ద 15 ఏళ్ల నుంచి పని చేస్తున్నాడు. రాములు 15 రోజుల నుంచి కనిపించకుండా పోయి బావిలో మృతి చెంది ఉన్నాడు. అతని మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 27, 2025

MDK: ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ నగేష్

image

మెదక్ జిల్లాలో గల నాలుగు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ నగేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. నేటితో మున్సిపాలిటీల పదవీ కాలం ముగుస్తుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. మెదక్‌తో పాటు నర్సాపూర్, తుప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ నగేష్ (లోకల్ బాడి)ను నియమించారు.

News January 27, 2025

రేగోడ్: గజ్వాడలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

image

రేగోడ్ మండలం గజ్వాడలో ఆదివారం ప్రజాపాలన గ్రామసభలో ఆర్.ఇటిక్యాలకు చెందిన ఇద్దరి లబ్ధిదారులకు రూ.1.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పీసీసీ అధ్యక్షుడు మున్నూరు కిషన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిగంబర్ రావు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వినీల వీరప్ప, నాయకులు ఈశ్వరప్ప, జ్ఞానేశ్వర్, లక్ష్మణ్, హనుమప్ప, నర్సింలు పాల్గొన్నారు.

News January 26, 2025

మెదక్: కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ

image

మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో అడిషనల్ కలెక్టర్ నగేష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావులు త్యాగ ఫలితంగా స్వాతంత్రం సిద్ధించగా అంబేడ్కర్ సారధ్యంలో గొప్ప రాజ్యాంగాన్ని రచించినట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారులు అధికారులు పాల్గొన్నారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

News January 26, 2025

మెదక్: లబ్దిదారుల తుది జాబితా సిద్ధం చేయాలి: సీఎస్

image

ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఫైనల్ జాబితా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి సూచించారు. శనివారం గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమావేశంలో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. నాలుగు సంక్షేమ పథకాల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా మండలం నుంచి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేయాలని సీఎస్ సూచించారు.

News January 26, 2025

మెదక్: జిల్లా వ్యాప్తంగా మొత్తం 544 సభలు: కలెక్టర్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా 21 నుంచి 23 వరకు 469 గ్రామ సభలు నిర్వహించినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 75 వార్డు సభలు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుకు 40,092, ఇందిరమ్మ ఇళ్లకు 23,383, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 5,501, రైతు భరోసాకు 308 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

News January 25, 2025

మెదక్: జిల్లాలో 88 ఉత్తమ అధికారుల ఎంపిక

image

మెదక్ జిల్లాలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా 88 మంది ఉత్తమ అధికారులు, పోలీస్, ప్రభుత్వ సిబ్బందిని ఎంపిక చేశారు. వీరికి ప్రశంసా పత్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ చేతులమీదుగా అందజేయనున్నారు. ప్రతి ఏటా ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో పనిచేసే వారిని ఎంపిక చేస్తారు.

News January 25, 2025

మెదక్: వైద్యా, విద్య ప్రమాణాలు మెరుగుపడాలి: మంత్రి

image

వైద్యా, విద్య ప్రమాణాలు మెరుగుపడేలా మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. నూతనంగా నియమితులైన రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.

News January 25, 2025

రేపు మాంసం దుకాణాలు బంద్: కమిషనర్

image

రేపు రామాయంపేట మున్సిపాలిటీలో మాంసం విక్రయాలు జరపొద్దని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. చికెన్‌, మటన్‌, చేపల మార్కెట్లు మూసివేయాలని సూచించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో మాంసం విక్రయాలు బంద్‌ ఉండనున్నాయి.

News January 25, 2025

రామాయంపేట: గిరిజన యువకుడికి 2 ప్రభుత్వ ఉద్యోగాలు

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండాకు చెందిన గిరిజన విద్యార్థి జవహర్ లాల్ నాయక్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇటీవల ప్రకటించిన సెంట్రల్ వాటర్ కమిషన్‌లో జూనియర్ ఇంజినీర్‌గా సెలెక్ట్ కాగా, శుక్రవారం టీఎస్పీఎస్సీ ప్రకటించిన నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందారు. తమ తండాకు చెందిన యువకుడు రెండు ఉద్యోగాలు సాధించడం పట్ల తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.