India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరో 6 కొత్త బ్రాంచీల ఏర్పాటుకు ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చింది. చిలుకూరు, మోతె, శాలిగౌరారం, నాంపల్లి, పెద్దవూర, మిర్యాలగూడ టౌన్లో 2వ బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నట్లు డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఆరు బ్రాంచులతో కలిపి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 47 బ్రాంచీలు అవుతాయని తెలిపారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాల్సిందిగా జిల్లాలోని ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, షార్ట్ ఫిల్మ్ మేకర్లకు ఆయన శుక్రవారం ఆహ్వానం పలికారు.

తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం, ధాన్యం సరఫరా వాహనాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన, వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామాలు సుస్థిర అభివృద్ధి దిశగా సాగేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. శుక్రవారం తిప్పర్తి మండలంలోని కంకణాలపల్లిలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. సుస్థిరమైన పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

జిల్లాలో 154 మద్యం దుకాణాలు ఉన్నాయి. అందులో 7 మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తులు బోణీ కాలేదు. ఇందులో దేవరకొండలో 70, చండూరులో 106, 108వ నెంబర్, ఓపెన్ కేటగిరి షాపులు, హాలియాలోని 128, 129 , 130 ఎస్సీ రిజర్వు, నాంపల్లిలోని 14వ నెంబరు ఎస్సీ రిజర్వ్ షాపులు ఉన్నాయి. గతంలో 757 దరఖాస్తులు రాగా.. ఇప్పుడు అందులో సగం కూడా దరఖాస్తులు రాకపోవడం గమనార్హం.

నల్గొండ జిల్లాలోని మద్యం దుకాణాలకు గురువారం మరో 496 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా, నేటి వరకు 1052 దరఖాస్తులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఆయన చెప్పారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వానకాలం ధాన్యం సేకరణపై కలెక్టరేట్‌లో గురువారం ఆమె కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. ధాన్యం సేకరణకు సంబంధించి కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ 92814 23653కు ఫిర్యాదులను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల ద్వారా ఇంకా మెరుగైన విద్యను అందించాల్సిన బాధ్యత కేజీబీవీల ప్రత్యేక అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కేజీబీవీలపై మండల ప్రత్యేక అధికారులు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

పూర్తి నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రానికి వచ్చిన దాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె శాలిగౌరారం మండలం, అడ్లూరు, తుడిముడి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అడ్లూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్, చెల్లింపులు, ఇండ్ల పురోగతిలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. జిల్లా యంత్రాంగం కృషిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి.గౌతమ్ అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
Sorry, no posts matched your criteria.