India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మల్లన్న గుట్ట వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. మ్యాచింగ్ అయిన ధాన్యాన్ని వచ్చినట్లుగానే కొనుగోలు చేయాలని ఆమె ఆదేశించారు. రైతుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పీఏసీఎస్ సీఈవో బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో కొంతమంది అధికారులు బరితెగిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ ఒకటి ఉందని తెలిసినా.. భయం లేకుండా అవినీతికి పాల్పడుతున్న ఘటనలు జిల్లా ప్రజలను ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారులుగా మారుతుండడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 12 మందికి పైగానే ఏసీబీకి పట్టుబడ్డా.. అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు.

జిల్లాలో 2025-27 సంవత్సరానికిగాను వైన్ షాపుల టెండర్లు వేయడానకి ఎవరూ ఆసక్తి చూపట్లేదు. దరఖాస్తు గడువు నేటితో మరో ఐదు రోజులే ఉంది. ఆబ్కారీశాఖ గత నెల 26న జిల్లాలోని 154 దుకాణాలకు టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 18న సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగియనుంది. నోటిఫికేషన్ ఇచ్చి సుమారు 19 రోజులు గడిచినా.. సోమవారం నాటికి దాఖలైన దరఖాస్తుల సంఖ్య 200లు కూడా దాటలేదని సమాచారం.

ఈ ఏడాది వర్షాలు రైతుల వెన్ను విరుస్తున్నాయి. జిల్లాలో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కంకి వెళ్లే దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పొట్టదశలో, మరికొన్ని చోట్ల కంకి వెళ్లి గింజపోసుకునే దశలో ఉన్నాయి. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రతికూలంగా మారాయి. వరిపొట్టలోకి నీరు చేరడంతో చీడపీడలు ఎక్కువవుతున్నాయి. కంకి వెళ్లిన పంటలో సుంకు రాలిపోతోంది. కంకి వెళ్లి గింజపోసుకుంటున్న వరి వానలకు నేలవాలుతోంది.

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానానికి పోటీ తీవ్రంగానే ఉంది. కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల స్వీకరణలో భారీగా ఆశావహులు దరఖాస్తు చేసుకుంటున్నారు. తొలిరోజు నల్గొండలో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. నిన్న నకిరేకల్లో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో సైతం మరో ఆరుగురు డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీనాయక్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 112 ఫిర్యాదులు అందాయి. గుడిపల్లి పోలీస్ స్టేషన్‌కు బాధితులు అప్పు పత్రాలు, ఖాళీ చెక్కులతో తరలివచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 185 మంది బాధితులు బాలాజీపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్యాంపును ఏఎస్పీ మౌనిక పర్యవేక్షించారు.

వాహనాల ద్వారా స్వల్పకాలిక పనులు చేసే వారందరూ జీవిత బీమా సౌకర్యాన్ని కలిగి ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకుగాను వివిధ బ్యాంకులు రూ.2 లక్షలతో వివిధ రకాల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. సంవత్సరానికి కేవలం రూ.20 చెల్లిస్తే బీమా వర్తిస్తుందన్నారు. కార్మికులందరికీ ప్రమాద బీమా వర్తింపజేసేందుకు శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని ఇసుక తవ్వకాలకు సంబంధించి కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను నివేదిక కోరారు. నీటిపారుదల, గనులు, భూగర్భ జల వనరులు, టీఎస్ ఎంఐడీసీ, అటవీ, రెవెన్యూ, ముఖ్య ప్రణాళిక అధికారి శాఖల నుంచి ఇసుక తవ్వకాలపై నివేదికలను అందించాలని ఆదేశించారు. ఆయా శాఖలు సమర్పించిన నివేదికలన్నింటిని పూర్తిస్థాయి జిల్లా సమగ్ర నివేదికగా మార్చి అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతీ సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో విజయవంతంగా ముగిసింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ దాదాపు 35 మంది అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ తెలిపారు.

చిట్యాలకు చెందిన బోరు బండి యజమాని ఒడిశాలో ఏనుగుల దాడిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రారపు సైదులు దసరాకు ఇంటికి వచ్చాడు. బోరు పనుల కోసం శనివారం ఒడిశాలోని దేన్ కనాల్ జిల్లాలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడికి ఒక్కసారిగా వచ్చిన ఏనుగుల గుంపు దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం మృతదేహన్ని చిట్యాలకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.