India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిట్యాల మండలం పెద్దకాపర్తి గాంధీ గుడిని VJA-HYD జాతీయ రహదారి పై ప్రయాణించే వారు భక్తితో దర్శిస్తుంటారు. గుడికి వచ్చిన భక్తులకు కంకణధారణ, అర్చన చేసి హారతి ఇచ్చి, డ్రై ఫ్రూట్స్ ను ప్రసాదంగా అందిస్తామని ఆలయ పురోహితులు కూరెళ్ళ నరసింహాచారి తెలిపారు. గాంధీ కూడా దైవ స్వరూపమేనని అన్నారు. దర్శనం అనంతరం కాసేపు గుడి వద్దే కూర్చుని భక్తులు ధ్యానం చేసి వెళ్తుంటారని చెప్పారు.

స్థానిక సంస్థలకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది. జిల్లాలో కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నగదు తరలింపుపై దృష్టి సారించింది. MPTC, ZPTC, సర్పంచ్ స్థానాలకు పోటీ చేయాలని భావించే ఆశావహులు, వారి బంధుమిత్రులపై నిఘా ఉంచింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున వారి రాక పోకలు సహా బ్యాంక్ అకౌంట్లపై దృష్టి పెట్టింది. తనిఖీల్లో రూ.50 వేలకు మించి నగదు దొరికితే స్వాధీనం చేసుకోనున్నారు.

నల్గొండ జిల్లా పరిధిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఉదయాదిత్య భవనంలో వ్యయ నిర్వహణ కమిటీలు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.

విజయదశమి పర్వదినం సందర్భంగా నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆయుధ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై ఆయుధాలకు, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో విజయాన్ని, సుఖసంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.

రాబోయే గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను ఏమాత్రం ఆషామాషీగా తీసుకోవద్దని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల నోడల్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆమె స్పష్టం చేశారు.

బ్రిటిష్ కాలం నుంచి అమలవుతున్న రిజిస్టర్ పోస్టు విధానాన్ని తపాల శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని పోస్టల్ సర్వీస్లను ఏకీకృత టారిఫ్‌గా రూపొందించారు. అంతేకాకుండా కొత్తగా ఓటీపీ ఆధారిత డెలివరీ సర్వీస్ తీసుకొచ్చింది. విద్యార్థుల స్పీడ్ పోస్టు ధర 10 శాతం తగ్గిందని పోస్టల్ శాఖ నల్గొండ సూపరింటెండెంట్ కె.రఘు నాథస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో 353 MPTC, 33 ZPTC స్థానాలకు ఎన్నికలను 1,957 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించనుంది. మొదటి విడతలో NLG, DVK డివిజన్లలోని 196 MPTC స్థానాలకు 483 గ్రామాలు, 4,152 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించనుంది. ఇందుకోసం 516 ప్రాంతాల్లో 1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రెండో విడతలో CDR, MLG డివిజన్లలోని 157 MPTC స్థానాలకు 386 గ్రామాలు, 3,342 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించనుంది.

జిల్లాలో 33 మండలాల పరిధిలోని 869 గ్రామ పంచాయతీలకు, వాటి పరిధిలోని 7,494 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 1వ విడతలో NLG, CDR డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లోని 318 గ్రామాలు, 2,870 వార్డులకు ఎన్నికలు జరుగున్నాయి. రెండో విడతలో MLG డివిజన్ పరిధిలోని 10 మండలాలకు చెందిన 282 గ్రామాలు, 2,418 వార్డులకు ఎన్నికలు జరుగు తాయి. 3 విడతలో DVK డివిజన్ పరిధిలోని 9 మండలాలకు చెందిన 269 జీపీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

వివిధ కారణాలతో విద్యకు దూరమైన వారిని గుర్తించి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో చేర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సోమవారం ఈ విషయంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్రాపౌట్ విద్యార్థులు పదో తరగతి, ఆపై విద్యను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. దీనివల్ల నిరక్షరాస్యత తగ్గుతుందని, విద్యార్థులు తమ భవిష్యత్తును మెరుగుపరచుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు గ్రీవెన్స్ డే ఉపకరిస్తుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 25 మంది ఆర్జీదారులతో నేరుగా మాట్లాడారు. సంబంధిత అధికారులకు తమ సమస్యలను ఫోన్లో వివరించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.