India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

యాసంగి సీజన్ ముగియడంతో మూసీ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి విడుదలను అధికారులు అధికారికంగా నిలిపివేశారు. గత డిసెంబర్ నుంచి సుమారు 100 రోజుల పాటు నిరంతరాయంగా సాగునీటిని అందించడంతో పంటలు చేతికి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభం కావడంతో కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి సరఫరాను పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 629.30 అడుగుల మేర నీటి నిల్వ ఉంది.

13వ శతాబ్దంలో రేచర్ల రాజులు నిర్మించిన దేవరకొండ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే అద్భుతమైన గుర్తింపు వస్తుంది. 7 కొండలను కలుపుతూ 500 ఎకరాల్లో విస్తరించిన ఈ కోటలో శిల్పకళా వైభవం ఉట్టిపడే కట్టడాలున్నాయి. శిథిలమవుతున్న ఈ చారిత్రక సంపదను కాపాడి, నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తే సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. దీని ద్వారా స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

యువతలోని నూతన ఆలోచనలకు పదును పెట్టి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈనెల 11న నల్గొండ ఐటీ టవర్స్‌లో ‘ఇన్నోవేషన్ పంచాయతీ’ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమ గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. అంకుర సంస్థల స్థాపన, సాంకేతిక సవాళ్లు, వ్యాపార విస్తరణపై నిపుణులు నేరుగా సలహాలిస్తారని అయన తెలిపారు.

యువతలోని నూతన ఆలోచనలకు పదును పెట్టి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈనెల 11న నల్గొండ ఐటీ టవర్స్‌లో ‘ఇన్నోవేషన్ పంచాయతీ’ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమ గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. అంకుర సంస్థల స్థాపన, సాంకేతిక సవాళ్లు, వ్యాపార విస్తరణపై నిపుణులు నేరుగా సలహాలిస్తారని అయన తెలిపారు.

జిల్లాలో మూస పద్ధతిలో సాగుతున్న వరి, పత్తి సాగుకు స్వస్తి పలికి, లాభసాటి పంటల వైవిధ్యం వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఏటా ఒకే రకమైన పంటలు వేయడం వల్ల భూసారం క్షీణించి దిగుబడులు తగ్గుతున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, కూరగాయలు, తోటపని పంటలను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. కాగా ఇప్పటివరకు 17 ఎకరాలకు పైగానే ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు.

జిల్లాలో వాతావరణ మార్పులు అన్నదాతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట చేతికందే సమయంలో, సాయంత్రం వేళల్లో వినిపిస్తున్న ఉరుముల శబ్దాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే నాన్-ఆయకట్టు గ్రామాల్లో కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని ఆరబోసుకున్న రైతులు భయపడుతున్నారు. నిన్న నిడమనూరు మండలంలో అకాల వర్షంతో చాలా చోట్ల పంటలు నేలకొరిగడంతో పాటు కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది.

నల్గొండ జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో, జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కును దాటి సుర్రుమంటున్నాయి. పెరుగుతున్న ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోత తోడవ్వడంతో జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఎండల తీవ్రత మే నెల వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నందున.. జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

నల్గొండ నగరపాలక సంస్థ ఈ ఏడాది ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 18 కోట్ల పన్ను డిమాండ్ ఉండగా, కేవలం ఈ ఏప్రిల్ నెలలోనే రూ. 8.50 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాది మొత్తంలో వచ్చే ఆదాయంలో దాదాపు సగాన్ని ఈ ఒక్క నెలలోనే రాబట్టేలా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక కసరత్తు చేస్తోంది.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తించనుంది. జిల్లాలోని నల్గొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లోని భవన యజమానులకు రాయితీ ఇవ్వనున్నారు.

NLG: స్వాతంత్ర సమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ జయంతిని ఈరోజు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎన్జీ కళాశాల ఎదురుగా, మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహాలకు కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్, గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.