India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వే అభివృద్ధి పనులు ఇంకా ప్రతిపాదనలు, పునాదుల స్థాయిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా NLG నుంచి మాచర్ల వరకు వేయాల్సిన కొత్త రైల్వే లైన్ వ్యవహారం ఏళ్ల తరబడి ముందుకు సాగడం లేదు. NLGను పల్నాడు ప్రాంతంతో కలిపే సుమారు 90 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ పూర్తయితే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. కానీ, భూసేకరణలో జాప్యం, నిధుల కొరత ఈ ప్రాజెక్టుకు శాపంగా మారాయి.

సర్కార్ తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది పదో తరగతి పేపర్ల దిద్దుబాటు చేసినా, దానికి సంబంధించిన రెమ్యూనరేషన్ ఇప్పటికీ అందకపోవడంపై నల్గొండకు చెందిన ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు కులగణన విధుల్లో పాల్గొన్న వారికీ పైసలు ఇవ్వలేదు. ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ రేట్లు పెంచిన సర్కారు, మరి టెన్త్ క్లాస్ వారికి ఎందుకు పెంచడం లేదని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.

విద్యాబోధనలోనే కాదు.. పర్యావరణ పరిరక్షణలోనూ NLG కేంద్రీయ విద్యాలయం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రకృతిని ప్రేమిస్తూ, వనరులను పొదుపుగా వాడుతున్న ఈ పాఠశాలకు 5-స్టార్ రేటింగ్ లభించినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో NLG కేవీకి ఈ స్థానం దక్కడం విశేషమని, ఇది ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషికి దక్కిన గౌరవమని ప్రిన్సిపల్ తెలిపారు.

నల్గొండ జిల్లాలో వీధి కుక్కల పట్ల అమానవీయంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ జి.వి.రమేశ్ హెచ్చరించారు. ఇటీవల శునకాలను హింసించడం, చంపడం వంటి ఘటనలు వెలుగులోకి రావడంతో ఆయన స్పందించారు. జంతు సంరక్షణ చట్టం-1960 ప్రకారం మూగజీవాలను హింసించడం నేరమని గుర్తుచేశారు. ప్రజలు జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించవద్దని, చట్టపరమైన ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు.

నల్గొండ జిల్లాలో ఈ నెల 20 నుంచి మే 5 వరకు పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO బిక్షపతి తెలిపారు. థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు, ప్రాక్టికల్స్ ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు జరుగుతాయని తెలిపారు. మొత్తం 3,837 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. దేవరకొండ, మిర్యాలగూడ, నల్గొండల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన జీవశాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ బిక్షపతి తెలిపారు. మొత్తం 106 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు సాధారణ విద్యార్థులు 19,698 మందికి గానూ 19,663 మంది హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 103 మందికి గానూ 97 మంది రాశారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 41 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన వివరించారు.

అనుముల మండలం యాచారంలో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 14 వేల ఎకరాల్లో సాగు ఉండగా, ప్రస్తుతం 2,500 ఎకరాల్లో పంట కోత దశకు చేరింది. రైతులకు రవాణా ఖర్చులు తగ్గించి, ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ మిల్లును నిర్మిస్తున్నారు. ప్రాథమికంగా గంటకు 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభించి, భవిష్యత్తులో దీనిని 120 టన్నులకు విస్తరించనున్నారు.

అత్యంత ప్రమాదకరమైన ‘పారాక్వాట్’ గడ్డిమందు విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిషేధం విధించిందని నల్గొండ DAO శ్రావణ్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో 24ను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ మందు వాడకం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా, పండే కూరగాయలు సైతం విషపూరితంగా మారి ప్రజల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతాయని ఆయన హెచ్చరించారు. ఎవరైనా విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్లే రోడ్లు నెత్తురోడుతున్నాయి. గడిచిన రెండేళ్లలో(2024-25) జిల్లా వ్యాప్తంగా 1800పైచిలుకు ప్రమాదాలు జరగ్గా..
దాదాపు 750మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 29మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోని వారే ఎక్కువగా ఉన్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు.

కొండమల్లేపల్లి పశువుల సంత పంచాయతీకి కాసుల వర్షం కురిపిస్తున్నా, సౌకర్యాల విషయంలో మాత్రం ‘కరువు’ కనిపిస్తోంది. ఈ ఏడాది బహిరంగ వేలంలో రికార్డు స్థాయిలో ₹3.80 కోట్ల ఆదాయం లభించింది. రాష్ట్రంలోనే రెండో పెద్ద సంతగా గుర్తింపు ఉన్నా.. ఇక్కడ రైతులకు, మూగజీవాలకు కనీస నీడ, తాగునీటి వసతి లేవు. ఇంత భారీ ఆదాయం వస్తున్నా మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యాపారులు మండిపడుతున్నారు.
Sorry, no posts matched your criteria.