India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాడి రైతులకు ప్రభుత్వం మరో అద్భుత అవకాశం కల్పించింది. రివైజ్డ్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద అమలు చేస్తున్న రెండు పాడి గేదెల పథకం దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంకెందుకు ఆలస్యం? అర్హులైన వారు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

భానుడి భగభగలకు అల్లాడుతున్న పక్షుల దాహం తీర్చేందుకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మానవత్వాన్ని చాటుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలోని చెట్ల కొమ్మలకు నీటి తొట్లు, డబ్బాలను ఏర్పాటు చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ చొరవతో సిబ్బంది వెంటనే నీటి వసతి కల్పించడంతో, పక్షులు దాహం తీర్చుకుంటున్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా మూగజీవాల పట్ల ఆయన చూపిన ఈ కారుణ్యాన్ని పర్యావరణ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు.

పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను కేంద్ర సెక్రటేరియట్ 68 మంది ASOల బృందం గురువారం రాత్రి సందర్శించింది. భారత్ దర్శన్‌లో భాగంగా వచ్చిన ఈ బృందం నాగార్జునకొండ మ్యూజియం, సాగర్ డ్యామ్‌ను వీక్షించింది. అనంతరం బుద్ధవనంలోని చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్తూపవనాలను సందర్శించారు. మహాస్తూపంలో లఘు చిత్రం వీక్షించి, ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. పర్యాటక ప్రదేశాల విశేషాలను గైడ్ సత్యనారాయణ వివరించారు.

నిధుల కొరతతో మూతపడిన నల్గొండ జిల్లాలోని సాగర్ నర్సింగ్ కళాశాల పునఃప్రారంభానికి ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. సుమారు రూ.13కోట్లతో ఈ విద్యాసంస్థను ఆధునీకరించనున్నారు. నూతన భవనంతో పాటు అత్యాధునిక వసతులు కల్పించి, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను చేరువ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా, విద్యార్థులకు మేలు చేకూరనుంది.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలకు వినియోగించే ఇంప్లాంట్ల కొనుగోలు వ్యవహారం ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. టెండర్ల గడువు ముగిసి నెలలు గడుస్తున్నా, నిబంధనల ప్రకారం కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేయకుండా పాత వారికే పనులు కట్టబెట్టాలని అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సరఫరా ప్రక్రియ స్తంభించిపోవడంతో ఆసుపత్రిలో ఇంప్లాంట్ కొరత ఏర్పడింది.

పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో భాగంగా నేటి నుంచి 17వ తేదీ వరకు భౌతిక, జీవశాస్త్రాల సబ్జెక్టుల మూల్యాంకనం షురూ కానుంది. వాటికి సంబందించి అసిస్టెంట్ ఎగ్జామినర్స్, స్పెషల్ అసిస్టెంట్ ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులంతా ఇవాళ ఉదయం 9 గంటలోగా నల్గొండలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల స్పాట్ వాల్యూయేషన్ కేంద్రానికి హాజరు కావాలని డీఈవో బిక్షపతి ఆదేశాలు జారీ చేశారు.

మైనార్టీ బాలురు, బాలికల కోసం ప్రత్యేకంగా 6 నెలల ఎమర్జెన్సీ కేర్ అసిస్టెంట్ శిక్షణ కార్యక్రమాన్ని నల్గొండలోని సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థలో నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రేణుక తెలిపారు. శిక్షణలో అభ్యర్థులకు ప్రతి నెలా రూ.2 వేలు స్టైఫండ్ ఇవ్వనున్నారు. కోర్సు కాలం 6 నెలలు ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణత, వయస్సు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపారు.

నకిలీ కరెన్సీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిందితుడిని తిప్పర్తి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితులు వాట్సాప్ ద్వారా ప్రజలను సంప్రదించి, రూ.500 నోట్ల ఆకారంలో ఉన్న కాగితాలను చూపించి అసలు నోట్లుగా నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని తెలిపారు.

Sorry, no posts matched your criteria.