India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నకిలీ కరెన్సీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిందితుడిని తిప్పర్తి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితులు వాట్సాప్ ద్వారా ప్రజలను సంప్రదించి, రూ.500 నోట్ల ఆకారంలో ఉన్న కాగితాలను చూపించి అసలు నోట్లుగా నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని తెలిపారు.

ఈ నెల 11న మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

నల్గొండ జిల్లాలో పైపుల ద్వారా సహజ వాయువు (PNG) సరఫరా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వాణిజ్య ఎల్‌పీజీ వాడకాన్ని తగ్గించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక గ్యాస్ పంపిణీ విస్తరణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పనుల విస్తరణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్రమంగా ఊపందుకుంటోంది. ఇప్పటివరకు ప్రతిపాదించిన 422 కేంద్రాలకుగాను 166 కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. వివిధ కొనుగోలు కేంద్రాలకు మొత్తం 1,42,995 మెట్రిక్ టన్నుల ధాన్యం చేరుకోగా, అందులో 154 మంది రైతుల నుంచి రూ.3.44 కోట్ల విలువైన 1,440 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.

నల్గొండ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేసి, సీజ్ చేస్తున్నట్లు SP శరత్ చంద్ర పవార్ బుధవారం తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్పీ హెచ్చరించారు.

క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధానికి జిల్లా సిద్ధమైంది. ఇప్పటికే 3,600 హెచ్‌పీవీ వ్యాక్సిన్ యూనిట్లు చేరుకోవడంతో ఆడబిడ్డల ఆరోగ్య రక్షణకు గట్టి పునాది పడింది. మహిళల పాలిట శాపంగా మారిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు 14 నుంచి 15 ఏళ్ల వయసున్న సుమారు 20 వేల మంది కిశోర బాలికలకు ఈ టీకాలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఈ టీకాలు వేయించాలని వైద్య ఆరోగ్యశాఖ కోరింది.

జిల్లాలో వేసవి ఎండల తీవ్రత పెరుగుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి చివరి నాటికి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఫిబ్రవరిలో సగటున 5.96 మీటర్ల లోతులో ఉన్న నీరు, మార్చి నాటికి 6.69 మీటర్లకు పడిపోయింది. కేవలం ఒక నెలలోనే 0.73 మీటర్ల మేర క్షీణత కనిపించింది. జిల్లాలోని 8 మండలాల్లో నీటి మట్టం పడిపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన కమ్యూనిస్టు యోధుడు నర్రా రాఘవరెడ్డి 1967, 1978, 1983, 1984, 1989, 1994 సంవత్సరాలలో నకిరేకల్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కమలమ్మ, రామ్ రెడ్డి దంపతులకు జన్మించిన రాఘవరెడ్డి ఎన్నో ఉద్యమాలలో ప్రజా సమస్యలపై కీలకంగా పని చేశారు. ప్రతిపక్ష నేతగా టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పని తీరుపై రాఘవరెడ్డి తీవ్రంగా విరుచుకుపడేవారు. నేడు రాఘవరెడ్డి వర్ధంతి.

జిల్లా ప్రజలు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. బుధవారం నల్గొండ క్లాక్ టవర్ వద్ద అడిషనల్ ఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో, బైక్‌లకు అమర్చిన 72 మాడిఫైడ్ సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో ధ్వంసం చేయించారు. ధ్వని కాలుష్యం కలిగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

HYD వనస్థలిపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హాలియా (M) అల్వాల వాసి శివ (20), మిర్యాలగూడ వాసి సందీప్(20) మృతి చెందారు. మంగళవారం రాత్రి వీరు రోడ్డు పక్కన ఆగి ఉండగా.. మద్యం మత్తులో ఉన్న రామ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కారుతో బలంగా ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.