India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ సమీపంలోని మర్రిగూడ బైపాస్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 15 నుంచి 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బైపాస్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండగా రోడ్డుపై పెట్టిన బారికేడ్‌ను తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
భర్త తలను భార్య పగలగొట్టిన ఘటన HYD KPHB PS పరిధిలో జరిగింది. SI సుమన్ తెలిపిన వివరాలు.. నల్గొండ వాసి శివ కాంట్రాక్టర్. కాగా భార్య, పిల్లలతో కలిసి KPHB రోడ్డు NO.3లో ఉంటున్నాడు. శుక్రవారం శివ స్నానం చేసే టైంలో వీపు తోమాలని భార్యపై అరిచాడు. ‘ఇరుగు పొరుగు వారు వింటే ఇజ్జత్ పోతుంది.. ఎందుకలా అరుస్తున్నావ్’అంటూ క్షణికావేశంలో రాయితో భర్త తల పగలగొట్టగా రక్తస్రావమైంది. అనంతరం శివ PSలో ఫిర్యాదు చేశాడు.
రైతుబంధులో అవకతవకలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తిరుమలగిరి మం. నెల్లికల్‌లో భూసమస్యల పరిష్కారం కోసం రైతులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్టిఫికెట్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
MG యూనివర్సిటీ పరిధిలో బీఈడీ సెమిస్టర్ ఫలితాలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ లక్ష్మీప్రభ శుక్రవారం విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్లో 92.6 శాతం, మూడో సెమిస్టర్లో 79.30 శాతం, రెండో సెమిస్టర్లో 84.96 శాతం, మొదటి సెమిస్టర్లో 77.7 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేసిన ఘటన అడ్డగూడూరు మండలం డి.రేపాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోనుగ స్వరూప, కృష్ణారెడ్డి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన కృష్ణారెడ్డి తాగి వచ్చి భార్య స్వరూపతో గొడవపడి హత్య చేశాడు. సాధారణ మరణంగా చిత్రీకరించబోయి దొరికిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నల్గొండ బోయవాడలో గల ఎస్బీఆర్ గార్డెన్స్‌లో ఈ నెల 5 నుంచి 27 వరకు కళాభారతి చేనేత హస్తకళ మేళా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జెల్లా సత్యనారాయణ తెలిపారు. ఇందులో అఖిలభారత హస్తకళ, చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలంతా ఈ ప్రదర్శనను తిలకించి చేనేతను ఆదరించాలని కోరారు. చేనేత కళాకారులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వస్త్రాలను అమ్మడం జరుగుతుందని తెలిపారు.
పైలెట్ పద్ధతిన నిర్వహిస్తున్న కుటుంబ డిజిటల్ కార్డు సర్వే సందర్భంగా ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని కవర్ చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సర్వే బృందాలను ఆదేశించారు. గురువారం ప్రారంభమైన కుటుంబ డిజిటల్ కార్డు పైలెట్ సర్వే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అయన నల్గొండ మున్సిపల్ పరిధిలోకి వచ్చే 4వ వార్డు పరిధిలో గల కేసరాజుపల్లి హ్యాపీ హోమ్స్ తనిఖీ చేశారు.
మూసీని ప్రక్షాళన చేస్తామని జైకా నుంచి వెయ్యి కోట్లు రుణం తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు.. అధికారం పోగానే మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం హెచ్ఐసీసీ నోవాటెల్‌లో జరిగిన “అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2024” కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ విధానాలపై మండిపడ్డారు.
ఉమ్మడి NLG జిల్లాలో 1,768 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఇటీవల గ్రామపంచాయతీ తుది ఓటర్లు లిస్ట్ విడుదల చేసింది. 1,768 గ్రామ పంచాయతీలో 15,478 వార్డులుండగా 22,45,868 గ్రామీణ ఓటర్లు ఉన్నారు. వీరిలో థర్డ్ జెండర్ 75 మంది, 11,11,488 మంది పురుషులు, 11,34,305 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 904 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. రైతులు పండించిన ధాన్యాన్ని పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనుంది. అందుకోసం నల్గొండ జిల్లాలో 375, యాదాద్రి జిల్లాలో 323, సూర్యాపేట జిల్లాలో 206 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.