India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్ని ప్రభుత్వ పథకాలలో పురోగతి తీసుకువచ్చేలా ఎంపీడీవోలు పనితీరును మెరుగుపరచుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలతో వివిధ అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో అతిసారం, నీటి వల్ల సంక్రమించే వ్యాధులు పెరగకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలదేనని అన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఎఫ్ఏలు, టీఏలు, ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో దుర్భర జీవితాలు గడుపుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. డీసీసీ అధ్యక్షుల నియామకం కంటే ముందే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల, గ్రామ కమిటీలను నియమించాలని పీసీసీ నిర్ణయించింది. గ్రామాలు, మండలాల కమిటీలను నియమిస్తారు. గ్రామ, మండల స్థాయిలోనూ పార్టీ కోసం పని చేసే వారినే అధ్యక్షులుగా నియమించనున్నారు. ఈ ప్రక్రియ వచ్చే 10 -15 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జిల్లాలో ప్రస్తుత వర్షాకాలంలో జీవాలకు నీలి నాలుక, మూతి వాపు వ్యాధులు విజృంభిస్తున్నాయి. జీవాలకు టీకాలు వేసేందుకు పశు సంవర్ధక శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. పట్టించుకోవడంలేదని పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జీవాలకు PPR వ్యాక్సిన్ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. జిల్లాలో కొంతమంది పశుసంవర్ధక శాఖ సిబ్బంది 50 గొర్రెలకు రూ.వెయ్యికి ఒక బుడ్డి చొప్పున అమ్ముతున్నారని తెలిపారు.
సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో వరినారు పోసుకునేందుకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. సాగర్ జలాశయంలో 540 అడుగుల మేరకు నీరున్నప్పుడు.. ఎగువ నుంచి వరద కొనసాగుతున్న సమయంలో గతంలో ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. కాగా ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నీటిని విడుదల చేయాలని కోరారు. అయితే, కాల్వలకు సాగునీటి విడుదలపై 14న సమీక్ష చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులకు మరోసారి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఖాళీ అయిన పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ HMగా పదోన్నతి కల్పించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆయా కేటగిరీల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బుధవారం విద్యాశాఖ కార్యాలయంలో పూర్తి చేశారు. 49 మందికి పదోన్నతి కల్పించే అవకాశాలు ఉన్నాయి.
కనగల్‌కి చెందిన కౌలు రైతు గోనెల చిన్న యాదయ్య (45) ఆర్థిక ఇబ్బందులు తాళలేక బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ ఎస్.రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యాదయ్య తనకున్న కొద్దిపాటి భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగులో నష్టాలు రావటంతో ఇవాళ మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదయ్య మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
కేతేపల్లి మండలం చీకటిగూడెంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు జానయ్య ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుంచి పడ్డాడు. ఈ క్రమంలో మోకు మెడకు చుట్టుకోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. జానయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిది పేద కుటుంబమని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. మృతదేహాన్ని నకిరేకల్ మార్చురీకి తరలించారు.
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే గ్రామపంచాయతీల సరిహద్దులపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపించారు. గ్రామాల్లో వార్డులను కూడా ఖరారు చేశారు. తాజాగా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTCల) పునర్విభజన షెడ్యూల్‌ను ప్రకటించారు. నల్గొండ జిల్లాలో 352కు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి.
ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్‌పీ ధరలకు మించి ఎరువులు అమ్మినా, ఇతర ఎరువులతో లింకు పెట్టినా తీవ్ర చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లాలో యూరియా సహా అన్ని ఎరువులు సరిపడా నిల్వలో ఉన్నాయన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు లోనవ్వాల్సిన అవసరం లేదని, అవసరమైన దశల్లో వెంటనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఎవరైనా ఎంఆర్‌పికి మించి విక్రయిస్తే వారి మీద కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.