India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలో అతిపెద్ద పండగ ‘దసరా’. ఈ పండుగకు వస్త్ర, నగల వ్యాపార సంస్థలు భారీగా ఆఫర్లను పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. NLG జిల్లాలోని శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో యువకులు వినూత్నంగా ‘రూ. 200 కొట్టు మేకను పట్టు’ అనే ఆఫర్ పెట్టారు. ఈ కూపన్ ఆఫర్‌లో మేక, నాటు కోళ్లు, మందు బాటిళ్లు గెలిచిన వారికి బహుమతిగా ప్రకటించారు. విషయం తమ దృష్టికి వచ్చిందని కౌన్సెలింగ్ ఇస్తామని ఎస్సై సైదులు తెలిపారు.
NLG- KMM- WGL టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగనుందని అధికారులు తెలిపారు. నవంబర్ 23వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు. అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నట్లు చెప్పారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి 12 తేదీ వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ భాస్కరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
సమగ్ర కుల జనగణన చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం సమగ్రకుల జన గణన సాధనకై బేగంపేట టూరిస్ట్ ప్లాజాలో ఉద్యోగులు, మేధావులు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేయకపోతే, 42 శాతం రిజర్వేషన్లకు బీసీలకు ఇవ్వకపోతే తీన్మార్ మల్లన్నదే బాధ్యత అని అన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు ఆర్టీసీ డిపోల పరిధిలో 50 కార్గో లాజిస్టిక్ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ రీజియన్ లాజిస్టిక్ ఏటీఎం సి.రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు వారి పార్సిళ్లను లాజిస్టిక్ బుక్ చేసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు భద్రంగా చేరుస్తామని పేర్కొన్నారు.
కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామపంచాయతీ శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బుగ్గ తండాకు చెందిన భీముడు (23), రమేష్(8)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో కూరగాయల ధరలు ముండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరల మోత మోగుతుంది. ఏ కూరగాయ చూసినా పావు కేజీ రూ.40 నుంచి రూ.60 పలుకుతోంది. జిల్లాలో రైతులు కూరగాయల సాగు వైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో కూరగాయలను ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినా అక్రమార్కుల్లో భయం కనిపించడం లేదు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర మండలాల్లో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో ఫ్లాట్లు ఏర్పాటుచేసి విక్రయించినట్లు తెలుస్తోంది. అధికారులు వీటిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులు దసరా పండుగ నాటి నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వర్ణ తాపడం పనులను స్మార్ట్ క్రియేషన్స్ వారికి అప్పగించారు. ఈ పనులను వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయనున్నారు.
NLG:గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాను జిల్లా అధికారులు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 10,42,545 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 5,25,780 మంది, పురుషులు 5,16,713 మంది,థర్డ్ జెండర్ 52 మంది ఉన్నారు. కాగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 9,067 మంది అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 868 గ్రామపంచాయతీలో 7,482 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతం 856 పంచాయితీల్లో 7,393 వార్డుల ఓటర్ల జాబితాను ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.