India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్గొండ జిల్లాలో ప్రమాదాల నివారణకు రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. ఇటీవల నల్గొండ జిల్లాలో స్కూల్ బస్సుల కింద పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో 360 డిగ్రీలు కనిపించేలా అద్దాలు బిగించుకోవాలని రవాణా శాఖ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది. నెల రోజుల్లో మిర్రర్లు ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వాణి ఆదేశించారు.

2025-26 ఆర్ధిక సంవత్సరమునకు గాను స్వచ్చంద సంస్థలు/ ప్రభుత్వేతర సంస్థలు.. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు, మానసిక వికలాంగుల ఆశ్రమాలు మొదలగు సంస్థలలకు ఆర్థిక సహాయం అందించుటకు గాను అర్హత గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లా పరిధిలోని, రిజిస్టర్డ్ స్వచ్చంద సంస్థలు/ప్రభుత్వేతర సంస్థలు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

జిల్లాలో పండుగల ముందు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రోజురోజుకు నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ మొదలు కానుంది. ఆ తర్వాత పది రోజుల్లోనే దసరా పండుగ ఉంది. ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతున్నది. పల్లీ నూనె రూ.190 వరకు విక్రయిస్తున్నారు. కందిపప్పు KG రూ.220కు పైగానే ఉన్నది.

నల్గొండ డైట్‌లో చోటు చేసుకున్న విద్యార్థినికి లైంగిక వేధింపుల ఘటనపై DEO బొల్లారం బిక్షపతి విచారణకు ఆదేశించారు. నల్గొండ ఎంఈఓ అరుంధతితోపాటు డైట్ ప్రిన్సిపల్ నరసింహను విచారణ అధికారులుగా నియమించామని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదని.. విద్యార్థినికి న్యాయం చేస్తామని DEO తెలిపారు. విచారణ కమిటీలో అరుంధతిని తొలగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

అప్పుల బాధలు తట్టుకోలేక గట్టుప్పల్‌కు చెందిన చేనేత కార్మికురాలు అప్పం యాదమ్మ (50) ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆమె, బాత్రూంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

జిల్లాలో చోటు చేసుకున్న రెండు విషాద ఘటనలు తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాయి. పది రోజుల వ్యవధిలో స్కూల్ బస్సుల కింద నలిగి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. NLG మాస్టర్ మైండ్ స్కూల్, పెద్దవూరలోని శాంతినికేతన్ స్కూలుకు చెందిన బస్సుల కింద ఇద్దరు చిన్నారులు బలయ్యారు. చిన్నారుల తరలింపులో యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ఘటనలు జరిగాయని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సహాయ పౌర సంబంధాల అధికారి, పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా డీపీఆర్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ పోస్టులకు ఎంపికైన వారు మార్చి 31, 2026 వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.

బీఆర్ఎస్ నాయకులు నన్ను ట్రోల్ చేసి ప్రచారం కల్పించి ఫేమస్ చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తాను మాట్లాడిన మాటల్లోని కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని ప్రచారం చేస్తున్నారని, దీనికి భయపడి తాను సైలెంట్‌గా ఉంటానని బీఆర్ఎస్ నాయకులు భ్రమపడుతున్నారని పేర్కొన్నారు. తాను ఒక్కరోజు ప్రెస్‌మీట్ పెడితే బీఆర్ఎస్ సోషల్ మీడియా మూడు రోజులు ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు.

వంగమర్తి ఇసుక రీచ్ నుంచి పూడిక ద్వారా తీసిన 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అభివృద్ధి పనులకు వినియోగించాలని జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్ణయించింది. శుక్రవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

పోషణ మాసం ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.