India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి సోమవారం నల్గొండ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా (సీపీఓ) అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో సీపీఓగా బాధ్యతలు నిర్వహించిన సూర్యాపేట అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్. కిషన్ అందుబాటులో ఉండకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆయన్ను తొలగించారు. దీంతో ప్రస్తుత సీపీఓగా ఆర్డీవో అశోక్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

బతుకమ్మ సంబరాల్లో మహిళలు, యువతులపై వేధింపులు, ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ పేర్కొన్నారు.

దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఉత్సవాల్లో టపాసులు, డీజేలను నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. చిన్నపాటి లౌడ్‌స్పీకర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల తర్వాత వాటిని కూడా నిలిపివేయాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

నల్గొండ: ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు మరింత కృషి చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 37 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.

నల్గొండ: జిల్లాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన లేకుండా ఉత్సవాలను జరుపుకోవచ్చని చెప్పారు. బతుకమ్మ సంబరాల్లో మహిళలను, యువతులను వేధించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను కాపాడాలని ఎస్పీ కోరారు.

జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో రోజుకో శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరగనున్నాయని ఆమె చెప్పారు. ఈ నెల 23న బుద్ధవనంలో ప్రత్యేకంగా బతుకమ్మ ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

మహిళలు ఎంతో సంబురంగా జరుపుకొనే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం షాకిచ్చింది. ఉచిత చీరలు పంపిణీ చేస్తారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. అక్టోబర్ తర్వాత చీరలు వస్తాయని, స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు మాత్రమే అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. అవి కూడా ఒకే కలర్ (డ్రెస్ కోడ్)లో ఉంటాయని తెలిసింది. జిల్లాలో 3,66,532 మంది SHG సభ్యులు ఉన్నారు.

మైనార్టీల ఆర్థిక సహాయం కోసం ప్రవేశపెట్టిన ‘రేవంత్ అన్నకా సహారా మిస్కీనో కే లియే’, ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ పథకాలకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి తెలిపారు. అర్హులు https://tgobmms. cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

నల్గొండ జిల్లాలో ప్రమాదాల నివారణకు రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. ఇటీవల నల్గొండ జిల్లాలో స్కూల్ బస్సుల కింద పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో 360 డిగ్రీలు కనిపించేలా అద్దాలు బిగించుకోవాలని రవాణా శాఖ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది. నెల రోజుల్లో మిర్రర్లు ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వాణి ఆదేశించారు.

2025-26 ఆర్ధిక సంవత్సరమునకు గాను స్వచ్చంద సంస్థలు/ ప్రభుత్వేతర సంస్థలు.. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు, మానసిక వికలాంగుల ఆశ్రమాలు మొదలగు సంస్థలలకు ఆర్థిక సహాయం అందించుటకు గాను అర్హత గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లా పరిధిలోని, రిజిస్టర్డ్ స్వచ్చంద సంస్థలు/ప్రభుత్వేతర సంస్థలు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.