Nalgonda

News August 11, 2024

శాలిగౌరారం ప్రాజెక్టుకు యాదగిరిరెడ్డి పేరు పెట్టాలని వినతి

image

శాలిగౌరారం ప్రాజెక్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రాజెక్టు నీటి సంఘం మాజీ ఛైర్మన్ చామల యాదగిరి రెడ్డి పేరు పెట్టాలని మండలానికి చెందిన పలువురు నేతలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. శనివారం మంత్రి ఉత్తమ్‌ను HYDలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కన్వీనర్ మారం గోనారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు చామల వెంకటరమణారెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు.

News August 11, 2024

నల్గొండ: యువతిపై NSUI నాయకుడి దాడి

image

యువతిపై NSUI నాయకుడు దాడి చేసిన ఘటన నల్గొండలో ఆలస్యంగా వెలుగు చూసింది. NSUI నాయకుడు మనిమద్దె సాయిరాం పట్టణంలోని ఓ పాఠశాలలో ట్రైనీ టీచర్‌గా పని చేస్తున్న యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తోటి ఉపాధ్యాయులు ప్రశ్నించగా వారిని బూతులు తిట్టినట్టు సమాచారం. గతంలో ఇదే యువతి విషయంలో అతనిపై 1 టౌన్ పోలీసు స్టేషన్‌లో బైండోవర్ కేసు ఉన్నట్లు తెలుస్తోంది.

News August 11, 2024

నల్గొండ: వారంలోనే పెళ్లి.. నిద్రలోనే యువకుడి మృతి

image

వారం రోజుల్లో వివాహం.. నిద్రలో యువకుడు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా నిడమనూరు(M) ముప్పారంలో జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి వాసి శివ(25) పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈనెల 18న శివకు వివాహం నిశ్చయమైంది. శనివారం పెళ్లి బట్టలు కోసం తల్లి ఉదయాన్నే శివను లేపేందుకు ప్రయత్నించగా లేవలేదు. దీంతో వారు చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. కాగా, శివ మృతికి గల కారణాలు తెలియరాలేదు.

News August 11, 2024

మంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

మిర్యాలగూడ, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని లిఫ్ట్ ఇరిగేషన్లు , నీటి పారుదల పనులపై సమీక్ష కోసం రేపు జిల్లాకు వస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

News August 10, 2024

మిర్యాలగూడలో సినిమా షూటింగ్

image

మిర్యాలగూడ మండలం నందిపాడలో మా ఊరి ప్రేమ కథ చిత్రం షూటింగ్‌ను బీజేపీ నాయకులు మదన్మోహన్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. రచయిత, దర్శకులు అంజి అయాన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. శివాలయ నిర్మాణానికి వారాహి సంస్థ తరఫున ఐదు లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో రవీంద్ర కుమార్, వీటి యాదవ్, భార్గవ్, గిరి, రవి శంకర్, చారి పాల్గొన్నారు.

News August 10, 2024

నల్గొండ లతీఫ్ సాహెబ్ గుట్టపై సూసైడ్ 

image

నల్గొండలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి చేతికి వాచ్, ఎడమ చెవికి రింగు ఉందని వారు తెలిపారు. ఘటనా స్థలంలో చెప్పులు, బ్యాగు, పర్సు ఉన్నాయన్నారు. మృతుడిని గుర్తిస్తే నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నంబర్ 87126 70141కు సమాచారం ఇవ్వాలన్నారు. 

News August 10, 2024

నాటు కోళ్లు మృతి.. కోదాడ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు 

image

తాను పెంచుకుంటున్న నాటుకోళ్లు మృతి చెందాయని ఓ మహిళ కోదాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి వివరాలిలా.. గుడిబండకు చెందిన నర్సింగోజు గీత నాటు కోళ్లను పెంచుతోంది. అడ్లూరుకు చెందిన కోటిరెడ్డి పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అతను ఎలుకల మందు పెట్టడంతో 38 కోళ్లు మృతిచెందాయని .. న్యాయం చేయాలని పోలీసులను గీత కోరింది. 

News August 10, 2024

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కీసరలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన బొల్లారం కవిత భర్తతో ద్విచక్ర వాహనంపై hyd నుంచి వాసాలమర్రికి వస్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి భర్త,కొడుకు, బిడ్డకు గాయాలయ్యాయి.

News August 10, 2024

కేంద్రంలో ఉద్యోగం చేస్తూ.. AEE గా ఎంపిక

image

మాడుగులపల్లి మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన మండల దుర్గయ్య, వెంకటమ్మ కుమారుడు శివ కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన TGSPSC ఫలితాల్లో నీటిపారుదల శాఖ AEE గా ఎంపికయ్యాడు. రైతు కుటుంబం నుండి ఉన్నత చదువులు చదివి, AEE గా ఎంపిక కావడం పట్ల పలువురు అభినందించారు.

News August 10, 2024

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు.. రేపే చివరి తేదీ

image

నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో 2024-25 ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు 12 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సిహెచ్ నర్సింహారావు తెలిపారు. పాలిసెట్ 2024 అర్హత సాధించినవారు, పదో తరగతి, నేషనల్ ఓపెన్ స్కూల్ ఉత్తీర్ణులైన వారు స్పాట్ కౌన్సిలింగ్‌కు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 11వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.