India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రూప్-2లో ఉమ్మడి నల్గొండ వాసులు సత్తా చాటారు. కోదాడకు చెందిన వెంకట హరవర్ధన్ రెడ్డి 447.080 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. మోత్కూరుకు చెందిన సాయికృష్ణారెడ్డి 422.91, రామన్నపేట మండలం సిరిపురానికి చెందిన సురేశ్ 411.865, పెన్ పహాడ్ మహ్మదాపురానికి చెందిన అన్నదమ్ములు శ్రీరామ్ మధుకు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, అతని తమ్ముడు శ్రీరామ్ నవీన్‌కు 326 ర్యాంకు వచ్చింది.
నార్కట్‌పల్లి మండలం చిప్పలపల్లిలో ఇటీవల అనారోగ్యంతో వలిగొండ శంకరయ్య భార్య పద్మ మరణించారు. ఈ విషాద సమయంలో గ్రామస్థులు పెద్ద మనసుతో స్పందించి, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శంకరయ్య కుటుంబానికి రూ.1,15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామ పెద్దలు, స్థానికులు కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మానసిక ఆత్మబలాన్ని ఇచ్చారు. గ్రామీణ సమాజంలో అండగా నిలిచిన ఈ ఘటన అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.
నల్గొండ జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. చండూరు, నాంపల్లి సర్కిల్ పరిధిలోని సీఐలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి బదిలీ చేశారు. మహబూబ్‌నగర్ మల్టీ జోన్ పరిధిలో వెయిటింగ్‌లో ఉన్న కె.ఆదిరెడ్డిని నాంపల్లి సీఐగా బదిలీ చేశారు. నల్గొండ ట్రాఫిక్ సీఐగా పని చేస్తున్న రాజుకు చండూరు సీఐగా పోస్టింగ్ ఇచ్చారు. నల్గొండ ఎస్బీ సీఐ శివ శంకర్‌ను కోదాడ టౌన్ సీఐగా బదిలీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు ఈ నెల 31లోగా ఎల్ఆర్ఎస్‌ను చెల్లించిన వారికి 25% రిబేట్ ఇస్తున్న విషయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్‌పై లైసెన్స్ టెక్నికల్ ప్లానర్లు, లే ఔట్ ఓనర్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రైటర్లతో సమావేశం నిర్వహించారు.
సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. ఈరోజు జరిగిన నేర సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని అన్నారు.నేర నియంత్రణలో బాగంగా అన్నీ ప్రాంతాలలో సిసిటివి కెమెరాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు,సిబ్బంది పని పనిచేయాలని ఆదేశించారు.
నల్గొండ జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈరోజు ఉదయ సముద్రం బ్యాలెన్స్ రిజర్వాయర్‌ను ఆమె సందర్శించారు. రబిలో సాగులో ఉన్న పంటలకు సాగునీరు అందటం లేదని వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. రైతులను తప్పుదోవ పట్టించి దుష్ప్రచారాలు చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
MGU పరిధిలోని డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ 11 నుంచి నిర్వహించనున్నట్లు సీఈవో డా. జి. ఉపేందర్ రెడ్డి తెలిపారు. డిగ్రీ 1వ సెమిస్టర్ ఏప్రిల్ 11, 3వ సెమిస్టరు APR 16, 5వ సెమిస్టర్ APR15 నుండి బ్యాక్లాగ్ విద్యార్థులకు, 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్ & బ్యాక్ లాగ్ విద్యార్థులకు ఏప్రిల్ 16 నుంచి నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్షల పూర్తి టైమ్ టేబుల్ MGU వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్. రమణారెడ్డి కుమారుడు వెంకట హరవర్ధన్ రెడ్డి గ్రూప్-2 ఫలితాల్లో 447.080 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా హరవర్ధన్ రెడ్డిని కళాశాల అధ్యాపకులు జి.లక్ష్మయ్య, ఆర్. పిచ్చి రెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, జి. యాదగిరి, వి. బల భీమ రావులు అభినందించారు.
2025 జనవరిలో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. మెమోలు www.bse.telangana.gov.in వెబ్ సైట్లో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసుకుని మెమోలు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కల విద్యార్థులు ఈనెల 20 లోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.