India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాధితుల ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి, మెరుగైన సేవలందించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. మంగళవారం ఆయన తిప్పర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులో అలసత్వం వహించరాదని, గంజాయి,అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పర్యవేక్షణ పెంచి శాంతిభద్రతలకు కృషి చేయాలని అన్నారు.

నల్గొండ జిల్లాను క్షయ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ రెండో దశ వంద రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నల్గొండ జిల్లాలో సాగునీరు అందక పంట పొలాలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు అల్లాడిపోతున్నారు. మునుగోడు మండలం ఉకోండిలో భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు పోయక పరిస్థితి దారుణంగా మారింది. చేతికొచ్చే దశలో వరి, ఇతర పంటలు ఎండుతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి దక్కేలా లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీటి ఇబ్బందులను తొలగించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

జిల్లాలోని పురపాలక ఎన్నికలు ముగిసి నెల రోజులు కావస్తున్నా, పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలామంది తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. NLG కార్పొరేషన్‌తో పాటు మిగిలిన 6 మున్సిపాలిటీల్లోని మెజారిటీ అభ్యర్థులు గడువు ముగుస్తున్నా లెక్కలు చెప్పకపోవడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. NLG జిల్లాలో ఇప్పటివరకు కేవలం 40% అభ్యర్థులు మాత్రమే లెక్కలు అప్పగించినట్లు సమాచారం.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో జిల్లాలో వంటగ్యాస్ సరఫరా అస్తవ్యస్తమైంది. వాణిజ్య సిలిండర్ల పంపిణీ నిలిచిపోవడంతో గృహ వినియోగ గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఇదే అదనుగా కొందరు డెలివరీ బాయ్స్, హోటల్ నిర్వాహకులు కుమ్మక్కై అక్రమ దందాలకు తెరలేపారు. ఒక్కో సిలిండర్‌ను రూ. 2,500 వరకు విక్రయిస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. అధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.

నల్గొండ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎకరాకు రూ.6 వేల చొప్పున 5,22,313 మందికి రూ.268.57 కోట్లు విడుదల చేసింది. జిల్లాకు మూడు విడతల్లో మొత్తం రూ.744.64 కోట్లు మంజూరు కానున్నాయి. 20 రోజుల తర్వాత రెండో విడత, ఆ తర్వాత 25 రోజులకు మూడో విడత నిధులు అందుతాయి. ఈ నెల 25లోపు కొత్త పాస్‌పుస్తకాలకు దరఖాస్తు చేసిన 20,668 మందికి త్వరలోనే ఈ సాయం అందనుంది.

నల్లగొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాయితీ పథకాల అమలుకు రంగం సిద్ధమైంది. మొత్తం 431 యూనిట్ల ద్వారా రూ.541.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు ఆన్‌లైన్ (OBMMS) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు.

నల్గొండలో వీధి కుక్కల బెడదను నివారించేందుకు శాశ్వత ప్రాతిపదికన పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో సంచరిస్తున్న శునకాలను వెంటనే పట్టుకోవాలని సూచించారు. జిల్లాలో అమలు చేస్తున్న ’99 రోజుల ప్రణాళిక’లో భాగంగా పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు.

Sorry, no posts matched your criteria.