Nalgonda

News March 23, 2026

ఎస్సీ కార్పొరేషన్ పథకాలకు రేపే ఆఖరి గడువు!

image

జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి కోసం ఎస్సీ కార్పొరేషన్ అమలు చేస్తున్న ఆర్థిక సహాయ పథకాలకు దరఖాస్తు చేసుకునే గడువు రేపటితో ముగియనుంది. 2025-26 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లాలో 431 యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 541.50 లక్షల లక్ష్యాన్ని నిర్దేశించింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించాలి: కలెక్టర్

image

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం అయన కలెక్టరేట్లో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ను సీరియస్ గా తీసుకోవాలన్నారు.

News March 23, 2026

నల్గొండ: ఎస్సీ యాక్షన్ ప్లాన్ పథకాలను సద్వినియోగం చేసుకోండి!

image

జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద అమలవుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో హిమబిందు కోరారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 24వ తేదీని చివరి గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలతో నల్గొండలోని ఎస్సీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News March 23, 2026

NLG: నేడే రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’!

image

నల్గొండ జిల్లాలోని 5.22 లక్షల మంది రైతులకు సోమవారం (నేడు) రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. రైతుకు భూమి ఎంత ఉన్నా.. తొలి విడతగా ఎకరాకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది. ఇందుకోసం ట్రెజరీకి రూ.268.57 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సరైన బ్యాంకు వివరాలున్న 5,22,313 మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బు నేరుగా జమ కానుంది. వివరాల్లో తప్పులున్న మిగతా రైతులకు వాటిని సరిచేశాక డబ్బులు వేస్తారు.

News March 23, 2026

NLG: ‘రెండూళ్ల రామయ్య’..!

image

సాధారణంగా ఏ ఊరి గుడిలో వెలసిన దేవుడికి ఆ ఊరిలోనే పూజలు, ఉత్సవాలు జరగడం ఆనవాయితీ. కానీ, NLG జిల్లా నకిరేకల్ (M) చందుపట్ల, కేతేపల్లి (M) బండపాలెంలో వెలసిన సీతారామచంద్రస్వామి కథే వేరు. రెండు ఊర్ల భక్తిని ముడివేస్తూ.. ఇక్కడి స్వామివారు ‘రెండూళ్ల రామయ్య’గా ప్రసిద్ధి చెందారు. ఈ 2 గ్రామాల ప్రజల మధ్య శ్రీరాముడు వారధిగా నిలిచారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం ఇక్కడే అట్టహాసంగా జరుగుతుంది.

NLG: 12-17 ఏళ్లకే పెళ్లిళ్లు.. ప్రాణాలకే ముప్పు!

image

12 నుంచి 17 ఏళ్ల లోపు బాలికలకు పెళ్లిళ్లు చేయడం వల్ల వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. తక్కువ బరువు, బీఎంఐ లోపంతో గర్భం దాల్చితే.. శిశువు మృతి చెందడం లేదా వైకల్యంతో పుట్టే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనిని అరికట్టేందుకు కేంద్రం ‘బాల్‌ వివాహ్‌ ముక్త్‌ భారత్‌’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే వెంటనే 1098, 181, 100కు లేదా స్థానిక అంగన్‌వాడీలకు సమాచారం ఇవ్వండి.

News March 23, 2026

నల్గొండ: వాహనం కొనేవారికి శుభవార్త!

image

జిల్లాలో రెండో వాహనం కొనుగోలు చేసేవారికి రవాణా శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. టూవీలర్ ఉండి, కారు కొంటే ఇప్పటివరకు వసూలు చేస్తున్న 2% అదనపు పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. సోమవారం (23వ తేదీ) నుంచి ఈ నూతన విధానంతో ‘వాహన్’ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఎలాంటి అదనపు భారం లేకుండా వాహనాలు కొనుగోలు చేయొచ్చు. దీని ద్వారా క్రయవిక్రయాలు, లైసెన్సుల సేవలు కూడా మరింత సులభతరం కానున్నాయి.