India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ఆబ్కారీ శాఖ కొత్త టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతోంది. 2025-27 సంవత్సరాలకు సంబంధించి, అక్టోబర్‌లోనే టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మొత్తం 155 మద్యం దుకాణాలకు టెండర్లు వేగవంతం చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 2.79 కోట్లు మంజూరు చేసింది. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి అందాల్సిన నిధులు ఆలస్యంగా విడుదలయ్యాయి. నల్గొండ జిల్లాలోని 1,068 పాఠశాలలకు రూ.1.25 కోట్లు, యాదాద్రి జిల్లాలోని 599 పాఠశాలలకు రూ.71 లక్షలు, సూర్యాపేట జిల్లాలోని 747 పాఠశాలలకు రూ.83.47 లక్షలు పాఠశాలల ఖాతాల్లో జమ కానున్నాయి.

నల్గొండ జిల్లా పశుసంవర్థక శాఖ చేపట్టిన పీపీఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం వంద శాతం పూర్తయింది. గత నెల 26 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 12.50 లక్షల గొర్రెలు, మేకలకు ఈ టీకాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సిబ్బందిని పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ జి.వి.రమేష్ అభినందించారు.

నల్గొండ జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుపై రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పథకం కోసం ప్రభుత్వం రూ.3.17 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు నిధులు ట్రెజరీకి చేరలేదు. దీంతో 1,400 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, పనిముట్లు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళనలో ఉన్నారు. సకాలంలో పనిముట్లు రాకపోతే పథకం ఉద్దేశం నెరవేరదని రైతులు అంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధత ఏర్పడింది. ఎన్నికలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో జిల్లాలో ఆయా గ్రామాల్లో ఆశావహుల్లో గందరగోళం నెలకొంది. ఓ వైపు జిల్లా యంత్రాంగం ఎంపీటీసీ జడ్పీటీసీ, సర్పంచ్‌ల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈనెల 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంత వరకూ రాలేదు. దీంతో రాజకీయ పార్టీల నేతలు గందరగోళంలో పడ్డారు.

IGNOUలో జూలై-2025 సెషన్‌కు సంబంధించిన ప్రవేశాలకు చివరితేదీ ఈ నెల 15 వరకు ఉందని ఇగ్నో HYD ప్రాంతీయ కేంద్రం డీడీ డా.రాజు బొల్లా తెలిపారు. మాస్టర్, డిగ్రీ, పీజీడిప్లొమా, డిప్లొమా వంటి వివిధ ప్రోగ్రాములకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.ignou.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఈ నెల 15న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, గవర్నర్ పాల్గొననున్న వేదికను పరిశీలించారు.

జిల్లాలో కూరగాయల సాగు ఏటేటా తగ్గుముఖం పడుతోంది. ఎక్కువ శాతం MNGD, DVK, సాగర్, NKL నియోజకవర్గాల్లో కూరగాయల సాగు ఎక్కువగా చేపడుతున్నారు. సాగు గిట్టుబాటుకాకపోవడం, ప్రభుత్వం రాయితీలు కల్పించకపోవడం, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, దళారులు రంగప్రవేశం చేయడం వంటి కారణాలతో రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదేళ్ల క్రితం 42 వేల ఎకరాల్లో కూరగాయలు సాగయ్యేవి. ప్రస్తుతం 80 శాతం సాగు పడిపోయింది.

MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాలను ఫైనల్ చేశారు. ఈ నెల 6న ముసాయిదా ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రకటించారు. జిల్లాలో 10,73,506 మంది ఓటర్లు, 33 ZPTC, 353 MPTC నియోజకవర్గాల పరిధిలో 1,956 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లుగా ముసాయిదా జాబితాలో ప్రకటించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో ఎలాంటి మార్పు లేదు కానీ ఒక పోలింగ్ కేంద్రం పెరిగినట్లు జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు తెలిపారు.

డ్రైవర్ల కొరతతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కని పరిస్థితి నెలకొంది. నల్గొండ, సూర్యాపేట డిపోలకు మొత్తం 156 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. జీతాలు తక్కువగా ఉండడంతో పాటు.. డీలక్స్ బస్సుల డ్రైవర్లకు రోజుకు రూ.30 వేల టార్గెట్లు ఇవ్వడంతో డ్రైవర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఆర్టీసీకి డ్రైవర్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. టార్గెట్లతో తమపై ఒత్తిడి పెరుగుతుందని డ్రైవర్లు అంటున్నారు.
Sorry, no posts matched your criteria.