India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్ అయిన బాలుడి కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. కిడ్నాప్ అయిన బాలుడితోపాటు నల్గొండ టూటౌన్ పోలీసులు శుక్రవారం ఎస్పీని కలిశారు. బాలుడిని ఎస్పీ ఎత్తుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసును 48 గంటల్లో ఛేదించినందుకు పోలీసులను ప్రశంసించారు.
జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈనెల 8న జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షుడు & ప్రధాన జిల్లా న్యాయమూర్తి ఎం. నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ వినియోగించుకొని తమ కేసులు రాజీ చేసుకోగలరని సూచించారు.
<<15677348>>ఎలిమినేటి <<>>1985లో తొలిసారి భువనగిరి MLAగా ఎన్నికై ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో హోం మినిస్టర్ అయ్యారు. TDPప్రభుత్వం నక్సల్స్‌పై నిషేధాస్త్రం ప్రయోగిచడంతో స్టేట్‌లో అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి. గద్దర్‌పై కాల్పులు..బెల్లి లలిత హత్య, పీపుల్స్‌వార్ అగ్రనేతలు ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి,నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్ ఎన్‌కౌంటర్లు జరగడంతో మాధవరెడ్డిని పీపుల్స్‌వార్ గ్రూపు తన హిట్‌లిస్ట్‌లో చేర్చి చంపింది.
మహాత్మ జ్యోతిరావ్ ఫులే బీసీ గురుకుల సంక్షేమ పాఠశాలలో 6, 7, 8, 9వ తరగతులలో బ్యాక్ లాక్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా కో-ఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని గురుకులాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులు ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన అతడి భార్యతో పాటు మరో ఇద్దరిని మాడ్గులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు.. ఆగామోత్కూర్‌కు చెందిన వెంకన్నతో సరితకు పెళ్లైంది. వీరి కాపురంలో మనస్పర్ధలు రావడంతో సరిత భర్త వెంకన్నకు దూరంగా ఉంటోంది. మనస్తాపానికి గురైన వెంకన్న గత నెల 22న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సరిత, ఊరుబిండు మల్లయ్య, మన్నెం శ్రీనులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో <<15675150>>యువకుడు <<>>ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. SI వివరాలు.. దామరచర్ల (M) వాడపల్లికి చెందిన అరుణ్(26) పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 1న బయటికి వెళ్లి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ సమీపంలో శవమై కనిపించాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. యువకుడి ఆత్మహత్యకు బంక్ యజమాని కారణమని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు.
మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువకుడు రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగి బూడిద కలర్ టీ షర్ట్ ధరించి, నల్ల కలరు లోయర్ ధరించి ఉన్నాడు. సమాచారం తెలిసిన వారు రూరల్ ఎస్ఐ లోకేష్ కుమార్ 8712670189కు తెలపాలని కోరారు.
NLG MGUలో ఐసెట్ 2025 నోటిఫికేషన్‌ను సెట్ ఛైర్మన్, ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి విడుదల చేశారు. జూన్ 8, 9వ తేదీల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చును. పూర్తి వివరాలకు https://icet.tsche.ac.inను సందర్శించాలన్నారు.
నల్గొండలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులందరూ ఇంటర్ పరీక్షలు భయపడకుండా రాసి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలన్నారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనలతో కూడిన వివిధత కా అమృత మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం సాయంత్రం ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 20 మంది చేనేత హస్త కళాకారులు ఈ ప్రదర్శనకు ఎంపిక కాగా నల్గొండ జిల్లా చండూరుకి చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరు శ్రీనివాసులు వారిలో ఉండడం విశేషం.
Sorry, no posts matched your criteria.