India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీస్ శాఖలో 33 సంవత్సరాలుగా సేవలందించడం అభినందనీయమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖలో నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్‌గా పనిచేస్తూ మంగళవారం పదవి విరమణ పొందుతున్న ఆర్.వెంకటేశ్వర్లును జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు.
☞ ఫస్ట్ ఇయర్లో (స్టేట్)
నల్గొండ – 56.74 శాతంతో 21వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 58.54 శాతంతో 17వ ర్యాంక్
సూర్యాపేట – 54.78 శాతంతో 24వ ర్యాంక్
☞సెకండ్ ఇయర్..
నల్గొండ – 68.97 శాతంతో 17వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 67.92 శాతంతో 22వ ర్యాంక్
సూర్యాపేట – 66.28 శాతంతో 26వ ర్యాంక్
నల్గొండ జిల్లాలో ఫస్టియర్ పరీక్షను 13,977 మంది రాయగా 7931 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 56.74 శాతంగా ఉంది. సెకండియర్‌లో 12,992 విద్యార్థులకు గాను 8,960 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజ్ 68.97శాతంగా ఉంది.
నాగార్జునసాగర్ జలాశయం సమాచారాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 514.60 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేయడ లేదు. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 1,350 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లాలో 1,25,733 మంది దరఖాస్తులు చేసుకున్నారు. బీసీ కుల గణన సమయంలో 27, 523 మంది.. సవరణల కోసం 37,229 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన అధికారులు 69,473 దరఖాస్తులకు అప్రూవల్ చేసినా సివిల్ సప్లై శాఖ ఓకే చెప్పలేదు.
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2వ దశ దరఖాస్తు గడువు ఇవాల్టి వరకు పొడిగించినట్లు నల్గొండ జిల్లా పరిశ్రమల కేంద్రం జాయింట్ డైరెక్టర్ వి.కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలవారి భత్యం రూ.5,000 మంజూరు చేస్తారని తెలిపారు. 12 నెలల ఇంటర్న్‌షిప్ కాల వ్యవధిలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశానికి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వేసవి వచ్చిందంటే చాలు తాటి ముంజలకు గిరాకీ పెరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పలువురు తాటి ముంజలను NLGకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. డజన్ రూ.70 వరకు అమ్ముతున్నట్లు తెలిపారు. NLG జిల్లాకు చెందిన మువ్వ రమేశ్ అనే యువ పారిశ్రామికవేత్త వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులోని తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్ ద్వారా 20 దేశాలకు తాటి ముంజలు ఎగుమతి చేస్తున్నారు.
చిట్యాల సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జహీర్ పటేల్ అనే వ్యక్తి బీదర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాడు. కంటైనర్‌ను పక్కకు ఆపి ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం చేయడానికి రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో 50 శాతం సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు అందించేవారు. ప్రస్తుతం ఆ పథకం రద్దు కావడంతో నానా పాట్లు పడుతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు.
రైతుల భూ సమస్యలు తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం-2025 తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ భారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా సోమవారం ఆమె గుండ్లపల్లి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు తెలంగాణ భూ భారతిపై అవగాహన కల్పించారు. భూ భారతిలో భూములకు సంబంధించి సవరణలు చేసే అవకాశం ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.