India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్గొండలోని ప్రభుత్వ ఐటీఐలో ఐటీఐ అభ్యర్థులకు ఈ నెల 9న అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాకు ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, మెషినిస్టు, స్టెనోగ్రఫీ, డ్రస్కీ మేకింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి, అర్హత గల వారు నేరుగా ఐటీఐ కాలేజీ వద్దకు హాజరు కావాలన్నారు.

నల్గొండ జిల్లాలో జాతీయ కుటుంబ సంక్షేమ పథకానికి స్పందన లభిస్తుంది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో పెద్ద ఎత్తున బాధిత కుటుంబాలు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10 రోజుల్లోనే 12,740 దరఖాస్తులు వచ్చాయి. పేద కుటుంబాలకు చెందిన ఇంటి పెద్ద మరణిస్తే ఆ ఇంటికి రూ.20వేల తక్షణ ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు.

గ్రామ పాలనాధికారులు తమ పనిపై పూర్తి శ్రద్ధ వహించి విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శనివారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన గ్రామ పాలనాధికారుల కౌన్సెలింగ్లో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఎలాంటి సిఫారసులకు, పక్షపాతానికి ఇందులో తావు లేదని అన్నారు. సోమవారం నాటికి వంద శాతం మంది విధుల్లో చేరాలని ఆమె ఆదేశించారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలు చండూరులో ఘనంగా ముగిశాయి. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. ఈ యాత్రలో చిన్నారులు పార్వతి పరమేశ్వరుల వేషధారణలో చూపరులను ఆకట్టుకున్నారు. వారి వేషధారణలు, ఆకర్షణీయమైన అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. గణేష్ ఊరేగింపులో వారు భక్తులకు దీవెనలను అందిస్తూ ముందుకు సాగారు. వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 7న ఆదివారం పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి నివేదన అనంతరం ఆలయం మూసి వేయనున్నట్లు ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు. సోమవారం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 8 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.

వినాయక నిమజ్జనంలో శుక్రవారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. తిప్పర్తి మండలం, మర్రిగూడెం గ్రామానికి చెందిన ఏశబోయిన యాదయ్య(45) వినాయక నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ పక్కన కూర్చుని ప్రమాదవశాత్తు పైనుంచి జారి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాగం ఏర్పాట్లు చేసుకుంటూ వెళుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితా ప్రకటించిన విషయం విదితమే. అలాగే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది జాబితాల రూపకల్పన ఇలా.. ఎన్నికలకు ముందస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికల నగారా మోగే అవకాశాలు ఉండటంతో ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా 5,984 గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించగా.. సుమారు 4 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. గ్రామాల్లో కొంత మంది శనివారం కూడా నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన నల్లగొండలోని వల్లభరావు చెరువు, మూసీ రిజర్వాయర్, 14వ మైలురాయి, MLG, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, DVK, కొండ బీమనపల్లి, డిండి వద్ద పెద్ద సంఖ్యల విగ్రహాలను నిమజ్జనం చేశారు.

కనగల్(M) ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈనెల 7న ఆదివారం పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 3 గంటల వరకు ఆలయం మూసి వేయనున్నట్లు ఆలయ ఇన్ఛార్జ్ ఈవో నాగిరెడ్డి తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 7 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.

వేములపల్లి మండలం సాగర్ ఎడమ కాలువలో తండ్రీకొడుకులు గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తు కాలువలో జారిపడిన సాంబయ్య (45), శివసాయి(20)లను గజ ఈతగాళ్లు రక్షించేందుకు యత్నించినా వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. వారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే, డీఎస్పీ పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.