India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3 నుండి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆలయ అర్చకులతో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
నల్గొండ జిల్లాలో ఫర్టిలైజర్ షాపుల యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం కనగల్ మండల కేంద్రంలో ఆ షాపులను ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా బ్లాక్‌లో అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభమైంది. కాగా NLG జిల్లాలో తొలిరోజు 31 మండలాలకు సంబంధించిన 35,568 మంది రైతులకు రూ. 46.93 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. NLG జిల్లా వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ద్వారా పెట్టుబడి కింద సాగుకు యోగ్యంగా లేని 12,040 ఎకరాల భూములకు కూడా రైతు భరోసా చెల్లించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ భూములకు రైతు భరోసా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్‌ను ప్రారంభించినట్లు NLG ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఈ ఆన్‌లైన్ యాప్లో నిరుద్యోగులు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు.
నల్గొండ జిల్లాలోని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా జమ చేసింది. జిల్లాలోని 33 మండలాలకు గాను గట్టుప్పల్, గుడిపల్లి మండలాలు మినహా 31 మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పెట్టుబడి సాయాన్ని జమచేసింది. 35,568 రైతుల ఖాతాల్లో 73,243 ఎకరాలకు ఎకరాకు రూ.6వేల చొప్పున మొత్తం రూ.46,93,19,160 జమ చేసింది.
నల్గొండ జిల్లాలో యాసంగి వరి సాగు ఊపందుకుంది. నాన్ ఆయకట్టులో ఇప్పటికే వరి నాట్లు పూర్తి కావచ్చాయి. ఆయకట్టు పరిధిలో వరినాట్లు కొనసాగుతున్నాయి. రైతులంతా సీజన్‌లో వరి సాగు వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాలలో వరి పంట సాగైనట్లు అధికారుల అంచనా. ఫిబ్రవరి నాటికి జిల్లాలో వరి నాట్ల సాగు పూర్తి కానున్నట్లు వారు పేర్కొంటున్నారు.
ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 22 వరకు, అలాగే మార్చి 5 నుంచి మార్చి 25 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రాక్టికల్, థియరీ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షల నిర్వహణపై సోమవారం సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల పోస్టర్‌ను ఆయన సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 9వరకు మండల స్థాయిలో ఈ పోటీలను నిర్వహిస్తామన్నారు.
నల్గొండకు మంగళవారం BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్లు BRS పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి నల్గొండకు చేరుకుంటారన్నారు. క్లాక్ టవర్ వద్ద జరిగే రైతు మహాసభలో ఆయన పాల్గొంటారన్నారు. కాగా, కోర్టు అనుమతితో రేపు నల్లగొండలో రైతు మహాధర్నాను బీఆర్ఎస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నల్గొండలో పాల్గొనే ధర్నా కార్యక్రమం ఏర్పాట్లను క్లాక్ టవర్ సెంటర్లో సోమవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు రామావత్ రవీంద్ర కుమార్, గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డిలు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాసరెడ్డి, జమాల్ ఖాద్రి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.