India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న ఆదికర్మ యోగి పథకం కింద క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పనులకు గాను ఉత్తమ ప్రదర్శన విభాగంలో నల్గొండ జిల్లాకు గుర్తింపు లభించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్‌లను అభినందించారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ప్రజలకు మంచి జరుగుతుందంటే ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధమే” అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇస్తే తీసుకుంటానని, లేదంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.

జిల్లాలోని పంచాయతీలకు డిజిటల్ సేవలను అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టి-ఫైబర్ పథకం జాడ లేకుండా పోయింది. పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఇంటింటికీ అంతర్జాల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం టి-ఫైబర్ ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర ఐటీశాఖ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసేలా పనులు ఆదిలోనే అటకెక్కాయి. అనేకచోట్ల పంచాయతీల్లో సౌర పలకలు అలంకారప్రాయంగా మారాయి.

నల్గొండ జిల్లాలోని PMSHRI పథకం కింద (36 ) ప్రభుత్వ స్కూల్స్ నందు బాలికలకు స్వీయ రక్షణకు సంబందించి 3 నెలల శిక్షణ ఇచ్చేందుకు కరాటే శిక్షకులు కావాలని జిల్లా యువజన, క్రీడల అధికారి మహ్మద్ అక్బర్ అలీ తెలిపారు. ఇందుకు గాను బ్లాక్ బెల్ట్ కలిగిన వారు అర్హులు వారికి నెలకు రూ. 10 వేలు చొప్పున పారితోషకం ఇస్తామన్నారు. మొదటిగా మహిళా అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.

ఈనెల 25న HZNRలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు NLG జిల్లా నుంచి నిర్దేశిత సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె ఈ నెల 25న హుజూర్నగర్లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాబ్ మేళా పై MGU, ఎన్జీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.

నల్గొండ జిల్లాలోని తాత్కాలిక (గిగ్) కార్మికులందరికీ జీవిత బీమా సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అమెజాన్, జొమాటో వంటి సంస్థల్లో పనిచేసే రోజువారీ కూలీలు కేవలం రూ. 20 వార్షిక ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చని తెలిపారు. ఈ నెలాఖరులోగా కనీసం 4 వేల మందికి బీమా చేయించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు అవగాహన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వారం రోజుల క్రితం ప్రారంభించిన ఈ సర్వేలో వివిధ ప్రాంతాల నుంచి పౌరులు పాల్గొని, విలువైన సమాచారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సర్వే ఈనెల 25 వరకు కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

మునుగోడు.. ఇప్పుడు ఈ పేరు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం వ్యాపారులకు పెట్టిన రూల్స్ పాటించాల్సిందే అంటూ ఇటీవల ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సర్కారు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం విక్రయాలపై రాష్ట్ర మొత్తం ఒకటే పాలసీ ఉంటుందని.. వ్యాపారులు భయపడవద్దని ఎక్సైజ్ మంత్రి జూపల్లి పేర్కొన్నట్లు సమాచారం.

దళారులు చేతిలో పత్తి రైతులు దగాకు గురవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం పత్తి పంట చేతికొచ్చింది. ఇప్పటికే పత్తి మొదటి దశ పత్తి ఏరడం పూర్తయి రెండో దశ కూడా ఏరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నేటికీ పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు గ్రామాల్లో తిష్ట వేసి కొనుగోళ్లు చేస్తున్నారు. దీపావళి తర్వాతే సీసీఐ కేంద్రాలను ప్రారంభించనున్నారు.

అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రేపు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘స్మృతి పరేడ్’ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ప్రజలు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని, అమరులకు నివాళులర్పించాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.