India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
త్రిపురారం మండలంలోని మాటూరుకి చెందిన ధనావత్ వస్త్రాంనాయక్ భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. దీంతో అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మాటూరు మాజీ సర్పంచ్ వాంకుడోత్ లలిత పాండు నాయక్ అతణ్ని ఘనంగా సన్మానించారు. స్నేహితులు, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జవహర్ నవోదయలో 9, 11 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫిబ్రవరి 8న నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరుకావాలని జవహర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. www.navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
చెర్వుగట్టు శ్రీ పార్వతి జిల్లా రామలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి చెర్వుగట్టులో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయానికి రంగులు వేసే కార్యక్రమం పూర్తి కావచ్చిందని టెంపుల్ కార్యనిర్వాహణాధికారి నవీన్ కుమార్ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
మునుగోడు మండల పరిషత్ ప్రాదేశిక (ఎంపీటీసీ) స్థానాల పునర్విభజనను అధికారులు పూర్తి చేశారు. నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలంలో వెల్మకన్నె ఎంపీటీసీ స్థానం కలవడంతో దానిని తొలగించారు. ప్రస్తుతం ఉన్న 31 గ్రామ పంచాయతీలను 13 ఎంపీటీసీ స్థానాలుగా గుర్తించారు. ఒక్కో ఎంపీటీసీ స్థానంలో 2వేల ఓటర్లు ఉండేలా సిద్ధం చేశారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎంపీడీవో శాంతకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెంను ఫిబ్రవరి 10 వరకు ఖాళీ చేయాలని ఇరిగేషన్ డీఈ కాశీం గ్రామస్థులకు సూచించారు. గురువారం సమావేశం నిర్వహించి వారికి వివరించారు. తమకు పూర్తి నష్ట పరిహారం, R&R ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు గ్రామాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదని గ్రామస్థులు స్పష్టం చేశారు.
చిన్నపిల్లలు, మహిళల సంరక్షణ బాధ్యత పూర్తిగా మహిళ, శిశు సంక్షేమ శాఖతో పాటు జిల్లా యంత్రాంగంపై ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టరేట్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, మహిళా శిశు సంరక్షణ, పాత అంగన్వాడి కేంద్రాల మరమ్మతులు, తదితర అంశాలపై ఐసీడీఎస్ అధికారులతో సమీక్షించారు.
మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు ఆధ్వర్యంలో యుటీఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా టికెట్ తీసుకునే విధానంపై రైల్వే ప్రయాణికులకు అవగాహన కల్పించారు. క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా మొబైల్ అప్లికేషన్ ద్వారా త్వరగతిన టికెట్ తీసుకుని రైలు ప్రయాణం చేయవచ్చని ప్రయాణికులకు సూచించారు. ఈ అవకాశాన్ని ప్యాసింజర్స్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
శాలిగౌరారం మండలం <<15238534>>ఉప్పలంచ మాజీ సర్పంచ్<<>> బండారు మల్లయ్య<<15212850>> హత్య కేసులో<<>> ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘పాత కక్షలతో ఈ నెల 21న మాజీ సర్పంచ్ బండారు మల్లయ్యపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను మృతిచెందాడు. 12 మందిని నిందితులను గుర్తించి ఏడుగురిని అరెస్టు చేశాం. మిగతా ఐదుగురిని త్వరలో పట్టుకుని రిమాండ్ కు పంపుతాం’ అని డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు.
గుర్రంపోడు మం. లక్ష్మీదేవిగూడెంలో ట్రాన్స్ కో ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన మహిళకు రిమాండ్ విధించిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. పోలీసుల వివరాలిలా.. 400 కేవీ లైన్ పనులను ఆపాలని లేకుంటే చస్తానని పద్మ అనే బెదిరించింది. దీంతో AD వీరస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ పురుగుమందు తాగబోగా హోంగార్డు సుజాత్ ఆపడానికి ట్రై చేశారు. ఆమె చేయి కొరకగా మహిళను రిమాండ్ చేసినట్లు SI మధు తెలిపారు.
దేశంలోని ఆర్టీసీలలో అతి తక్కువ శాతం ప్రమాదాలు తెలంగాణ ఆర్టీసీలో మాత్రమే ఉన్నాయని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నల్గొండ డిపో గ్యారేజ్‌లో ఉమ్మడి నల్లగొండ ఆర్ఎం కె. జానిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ భద్రత మాసోత్సవాలలో పాల్గొని మాట్లాడారు. ఏ సీజన్లోనైనా కష్టపడి డ్రైవర్లు బస్సులు ఆపరేట్ చేస్తున్నారని, డ్రైవర్లు దేవుళ్లతో సమానమని అన్నారు. డ్రైవర్లు స్పీడ్ కంట్రోల్ చేసుకొని నడపాలన్నారు.
Sorry, no posts matched your criteria.