India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

క్షేత్రస్థాయిలో జాతీయ ఆహార భద్రత చట్టం- 2013 అమలు పరిశీలన నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఈనెల 15న కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాలలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రాష్ట్ర ఆహార కమిషన్ ఒకరోజు పర్యటనలో భాగంగా ఆరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రెండు మండలాల్లో ఆహార భద్రత చట్టం అమలుతీరును పరిశీలిస్తారన్నారు.

నల్గొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామ శివారులో అర్ధరాత్రి శివలింగం ప్రత్యక్షమైంది. ఆ శివలింగాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఆకతాయిల పనేనని గ్రామస్థులు భావిస్తున్నారు. శివలింగం ప్రత్యక్షమైన స్థలం కొంత వివాదంలో ఉన్నట్లు తెలిసింది.!

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఈనెల చివరి వరకు పొడిగించాలని జిల్లాలోని యువకులు కోరుతున్నారు. చాలామంది వివిధ కారణాలతో పాటు సర్వర్ డౌన్ కావడంతో దరఖాస్తు చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తోంది. చాలామంది యువకులు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలను తీసుకోలేకపోయారు. ప్రభుత్వం స్పందించి గడువు తేదీని పొడిగించాలని కోరుతున్నారు.

జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. గత రెండు మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం దామరచర్ల మండలంలో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతి తక్కువగా చింతపల్లి మండలం గోడకండ్లలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా బీబీనగర్ బొమ్మలరామారంలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామశివారులో శనివారం లారీ డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మిర్యాలగూడెం నుంచి హైదరాబాద్ వైపు ఇటుకల లోడ్తో వెళుతున్న లారీ మార్గమధ్యంలో పెద్దకాపర్తి వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ బోల్తా పడిన లారీ ముందు మద్యం మత్తులో నిద్రపోవడం గమనార్హం.

ఆస్తికోసం కూతురిని పినతల్లి చంపిన ఘటన గతేడాది DEC 7న జరగ్గా పోలీసులు ఈ కేసును ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. కూతురిని సవతితల్లి హతమార్చి వంగమర్తి వాగులో మృతదేహాన్ని పూడ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో మేడిపల్లి PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. మహేశ్వరి మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.

ఈ నెల రెండవ శనివారం, సోమవారాలు ప్రభుత్వ సెలవు దినాలైనప్పటికీ రాజీవ్ యువశక్తి పథకం కింద దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలలో స్పష్టం చేశారు. రాజీవ్ యువశక్తి పథకం కింద నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ యువత స్వయం ఉపాధి పొందేందుకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కూతురిని చంపిన కేసులో తల్లికి కోర్టు ఉరి శిక్ష విధించింది. కూతరుకు మతిస్థిమితం లేకపోవడంతో ఆ తల్లి ఈ దారుణానికి ఒడిగట్టింది. మోతె మండలం మేకలపాటి తండాలో ఏప్రిల్ 2021లో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి విచారణ జరగుతుండగా తాజాగా భానోత్ భారతికి కోర్టు శిక్ష విధించింది.

హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. శోభ యాత్ర నిర్వహించే సమయంలో ఇతర మతాల వారి మనోభావాలను కించపరిచే నినాదాలు చేయరాదన్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు, తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిదిలో డీజేలకు అనుమతి లేదని పోలీసువారి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లాలోని చీఫ్ ఇంజనీర్(ఇరిగేషన్), NLG డివిజన్ పరిధిలోని కార్యాలయంలో లష్కర్(229), హెల్పర్(56) పోస్టులకు అవుట్సోర్సింగ్ సేవలను అందించటానికి జిల్లా ఉపాది కల్పన కార్యాలయంలో ఎంప్యానెల్ అయినటువంటి ఆసక్తి గల ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లను కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.