India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యాధులు ముసుకురుకుంటున్నాయి. కురుస్తున్న వర్షాలతో పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీలు, వీధుల్లో మురుగు పేరుకుపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలతో సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఎక్కడ చూసినా ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. జ్వరాల బారిన పడి ప్రజలు ఆసుపత్రులపాలవుతున్నారు.
వచ్చే మార్చినాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నార్కట్‌పల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న SLBC సొరంగం పనుల పూర్తికి రాష్ట్ర సీఎంతో మాట్లాడి రూ.2200 కోట్లు మంజూరు చేయించడమే కాకుండా, నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ లో నిధులు ఏర్పాటు చేశామని తెలిపారు.
నల్లగొండ జిల్లాలో 68 మంది బత్తాయి రైతులు నిండా మునిగారు. తిరుపతి ఉద్యాన యూనివర్సిటీ నుంచి 11 ఏళ్ల క్రితం బత్తాయి మొక్కలు తీసుకువచ్చి జిల్లాలో నాటిన రైతులు దిగుబడి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సుమారు 350 ఎకరాల్లో ఈ బత్తాయి మొక్కలు నాటారు. సాధారణంగా నాలుగో ఏటా నుంచి దిగుబడి ప్రారంభమవుతుందని 8 ఏళ్లు గడిచినా సాధారణ దిగుబడి కూడా రాలేదని రైతులు తెలిపారు.
నార్కట్‌పల్లి మండల ఎంపీడీవో కార్యాలయ సూపరిటెండెంట్ కోమటి ప్రదీప్ గుండెపోటుతో మరణించారు. బదిలీ ప్రక్రియలో భాగంగా కౌన్సెలింగ్ కోసం జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లి అనంతరం హైదరాబాదులో నివాసానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ప్రదీప్ వాంతులు చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారని సన్నిహితులు చెప్పారు.
క్షేత్రస్థాయి పర్యటనలతో కలెక్టర్ నారాయణరెడ్డి జోరు పెంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలు, NLGలోని పలు శాఖల కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ఏళ్లుగా వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడిన బాలసదనం, సఖి, శిశు గృహాల్లో మౌలిక సదుపాయాలకు గత కలెక్టర్ హరిచందన కృషి చేయగా.. ఆ సంప్రదాయాన్ని ప్రస్తుత కలెక్టర్ కొనసాగిస్తున్నారు.
పంట రుణమాఫీ పథకం అమలుకు సంబంధించి నల్గొండ జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటు చేసినట్లు DAO శ్రవణ్‌కుమార్ తెలిపారు. కాల్ సెంటర్ నంబర్ 7288800023కి ఫోన్ చేయడం ద్వారా రైతులు తమ సమస్యలకు పరిష్కారం చేసుకోవచ్చన్నారు. ఫోన్ చేసేటప్పుడు ఆధార్ నంబర్ తెలపాలన్నారు. మండల స్ధాయిలో ఏవోకు ఫోన్ ద్వారా, స్వయంగా ఫిర్యాదు చేసి పరిష్కారం పొందాలన్నారు.
రుణమాఫీకి సంబంధించి రైతుల సమస్యలను పరిష్కరించేందుకుగాను ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వివిధ అంశాలపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి తాజా సమాచారం. ఇన్ ఫ్లో 00 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 9,874 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 504.60 అడుగులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టి.ఎం.సిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 122.6854 టీఎంసీలుగా ఉన్నది.
మునుగోడు మండలానికి చెందిన వీరమళ్ళ సునిత మగవారికి ధీటుగా హలం పట్టి పంట పొలాల్లో దూసుకెళ్తుంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ నారీమణి చిన్ననాటి నుంచే పొలం పనుల్లో మెలకువలు నేర్చుకొని రాటు తేలింది. తనకున్న కాడెద్దులతో పత్తి, వరి పొలాల్లో గుంటుక, గొర్రు తోలుతూ ఒక ఎకరానికి ₹800/- చొప్పున రోజుకి 4 ఎకరాలకు ₹3200/- సంపాదిస్తుంది. నేడు స్వతహాగా ఉపాధి బాట పట్టి మరెందరికో ఆదర్శంగా నిలిచింది.
రుణ మాఫీకి కోర్రీలు పెట్టారని, ఆరు హామీలు అటకెక్కించారని BRS పార్టీ రాష్ట్ర నాయకుడు RS ప్రవీణ్ కుమార్ అన్నారు. మఠంపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రైతు రుణమాఫి అని చెప్పి లక్ష లోపు సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.