Nalgonda

News July 13, 2024

కోదాడలో జబర్దస్త్ నటులు వినోద్, అప్పారావు సందడి

image

కోదాడలో శనివారం జబర్దస్త్ నటులు అప్పారావు, వినోద్ సందడి చేశారు. పట్టణానికి చెందిన స్నేహిత ఉమెన్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు మాతంగి శైలజ నివాసంలో జరిగిన ఓ శుభకార్యానికి వారు హాజరయ్యారు. వారిని చూసి అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అనంతరం ఆటపాట నిర్వహించి వారు అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బంధువులు మిత్రులు పాల్గొన్నారు.

News July 13, 2024

మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత

image

మిర్యాలగూడ నెల్లిమెట్ల జంక్షన్ వద్ద రూరల్ ఎస్సై ధనుంజనాయుడు, సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టానే. చింతపల్లివైపు నుంచి వస్తున్న కారును చూసి అనుమానం వచ్చి తనిఖీ చేశారు. దీంతో కారులో 140కేజీల గంజాయి బయటపడింది. విలువ సుమారు రూ. 35 లక్షల ఉంటుందన్నారు. నిందితులు అరుణ్, రేంజు, ఆనంద్, కొర్ర అర్జున్‌లను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని వెల్లడించారు.

News July 13, 2024

NLG: ఉమ్మడి జిల్లాకు త్వరలో కొత్త బస్సులు!

image

ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ కొత్తగా మరో కేటగిరీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో త్వరలో కొత్త మార్గాలకు 30 బస్సులు, పాత మార్గాల్లో అదనంగా మరో 30 బస్సులతో పాటు నల్గొండ, సూర్యాపేట పరిధిలో మరో 50 విద్యుత్తు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రీజియన్ పరిధిలో మొత్తం 640 బస్సులు ఉండగా.. నిత్యం 2.50 లక్షల KM తిరుగుతూ సుమారు రూ.150కోట్ల ఆదాయం వస్తుంది.

News July 13, 2024

నడిగూడెం: తెల్లబల్లి గ్రామంలో 50 మంది డెంగ్యూ జ్వరం

image

నడిగూడెం మండలంలోని తెల్లబల్లి గ్రామంలో డెంగ్యూ జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సుమారు 50 మందికి పైనే డెంగ్యూ జ్వరానికి గురై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాంతకంగా మారక ముందే అధికారులు వైద్య సిబ్బంది స్పందించి ప్రజలు డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News July 13, 2024

సూర్యాపేట: పర్మిషన్ లేకుండా సెలవు.. కలెక్టర్ సీరియస్

image

సూర్యాపేట జిల్లా సింగిరెడ్డి పాలెం పాఠశాల తనిఖీల్లో భాగంగా ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా సెలవులో ఉన్న HM నరేందర్, టీచర్ శ్రీనివాస్‌పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సీరియస్ అయ్యారు. షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ అధికారిని ఆయన ఆదేశించారు. సమయపాలన పాటించి విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని కోరారు.

News July 13, 2024

చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

వర్షం కారణంగా చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా ముందే పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆర్డీవోలు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడైనా వర్షం నీటికి తెగిపోయేందుకు, గండ్లు పడేందుకు అవకాశం ఉన్న చెరువులను గుర్తించాలన్నారు.

News July 12, 2024

కేసీఆర్‌ని జైలుకి పంపండమే నా లక్ష్యం:రాజగోపాల్ రెడ్డి

image

రాష్ట్రంలో BRS సమాధి అయ్యిందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ని జైలుకి పంపండమే తన మరో లక్ష్యమని తెలిపారు. ఆయనతో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా జైలుకు వెళ్తారన్నారు. BRSలో ఎవరూ ఉండరని హరీశ్ రావు సైతం బీజేపీలోకి వెళ్తారని పేర్కొన్నారు.

News July 12, 2024

వేధింపుల కేసులో నిందితుల అరెస్టు

image

మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో ఆకతాయి వేధింపులకు గురై <<13605754>>కళ్యాణి <<>>అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కళ్యాణి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులకు గురిచేసిన నిందితులు ఆరూరి శివ, కొమ్మనబోయిన మధులను పోలీసులు అదుపులోకి తీసుకొని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

News July 12, 2024

బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో బీబీనగర్ నాయకులు

image

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాశం భాస్కర్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వారు తెలిపారు.

News July 12, 2024

తిప్పర్తి: యువతి సూసైడ్.. పరారీలో నిందితులు

image

మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ పరిధిలోని చింతల గూడేనికి <<13605754>>యువతి <<>>ఆత్మహత్యకు కారణమైన నిందితులు పరారీలో ఉన్నారు. ఇద్దరు యువకులు కళ్యాణిని వేధించడంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతికి కారణమైన యువకులను పట్టుకోవడానికి పోలీసులు 3 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. పోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.