India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇక భూ సర్వేలు చకచకా కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 17 మంది ప్రభుత్వ సర్వేయర్లు, ముగ్గురు డిప్యూటీ సర్వేయర్లు, ఆరుగురు కమ్యూనిటీ సర్వేయర్లు మొత్తం 26 మంది మాత్రమే ఉన్నారు. లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకంతో సర్వేయర్ల కొరత తీరనుంది. ఇప్పటికే లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో తొలి విడత శిక్షణకు ఎంపికైన లిస్టును తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది.

నల్గొండ జిల్లాలో 154 వైన్స్‌లకు 4,619 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న ఏకంగా 2, 180 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున రూ. 138.57 కోట్లు ఆదాయం సమకూరింది. గత పాలసీలో 155 వైన్స్‌లకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున రూ. 141.14 కోట్ల ఆదాయం లభిచింది. 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తులు పెరిగే అవకాశముంది. 27డ్రా తీయనున్నారు.

నల్గొండ నుంచి మిర్యాలగూడకు ప్రయాణిస్తున్న నెమ్మాని సంధ్య ఆటోలో తన ల్యాప్‌టాప్‌తో పాటు రూ.1500 నగదు మరిచిపోయారు. అయితే ఆటో డ్రైవర్ ఎండీ లతీఫ్ వాటిని నల్గొండ టూ టౌన్ పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. ఎస్సై వై. సైదులు విచారణ జరిపి ల్యాప్‌టాప్, నగదును సదరు మహిళకు అందజేశారు. లతీఫ్ నిజాయితీని ఎస్సై అభినందించారు. ఈ మంచితనం ఆదర్శనీయమని ఎస్సై పేర్కొన్నారు.

సమాజంలో న్యాయ అవగాహన కల్పించడమే పారా లీగల్ వాలంటీర్ల(పీఎల్‌వీ) ప్రధాన లక్ష్యమని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పురుషోత్తం రావు అన్నారు. పీఎల్‌వీల ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయం అందరికీ చేరేలా పీఎల్‌వీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరగబోయే జాతీయ కాన్ఫరెన్స్‌కు ఎంపికైన శ్రీకాంత్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ఉదయం నుంచే ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లాలో 329 షాపులకు టెండర్లు స్వీకరిస్తున్నారు. అయితే నల్గొండ జిల్లా ధర్వేశిపురం వైన్స్ కోసం 100కు పైగా టెండర్లు దాఖలైనట్లు సమాచారం. నేడు బంద్ కారణంగా కొంత ఇబ్బంది కలిగినప్పటికీ DDలు తీసి ఉంటే రాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నాగార్జునసాగర్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయనకు ఘన స్వాగతం పలికారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా సాగర్ పరిసరాల్లో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే వైన్స్ టెండర్లు వేస్తామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నల్గొండలో వైన్స్ టెండర్ల ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 154 వైన్ షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, నేడే తుది గడువు కావడంతో భారీ సంఖ్యలో టెండర్లు వస్తాయని ఆయన చెప్పారు.

మద్యం టెండర్లకు ఇవాళ ఆఖరి రోజు అయినందున దరఖాస్తుదారులు ఇబ్బంది పడకుండా కౌంటర్లు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు. ఇప్పుడు 14 కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు తెలిపారు. 5 గంటల్లోపు దరఖాస్తులతో వచ్చిన వారి నుంచి ఎంత రాత్రైనా దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు.

మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఊపందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 1,387 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 8 గంటల వరకూ లైన్లో ఉండి దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటివరకు మొత్తం 2,439 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది.

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరో 6 కొత్త బ్రాంచీల ఏర్పాటుకు ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చింది. చిలుకూరు, మోతె, శాలిగౌరారం, నాంపల్లి, పెద్దవూర, మిర్యాలగూడ టౌన్లో 2వ బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నట్లు డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఆరు బ్రాంచులతో కలిపి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 47 బ్రాంచీలు అవుతాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.