Nalgonda

News December 2, 2024

మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు భారంగా ‘!

image

జిల్లాలో కోడిగుడ్డు ధరలు మరింత పెరిగాయి. ఒక్కసారిగా గుడ్డు ధర పెరగడంతో మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గుడ్డు ధర రూ.6లు ఉండగా ఇప్పుడు రూ.7కు చేరింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం 3 రోజులు కోడి గుడ్లు విద్యార్థులకు అందించాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక్కో గుడ్డుకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండడంతో తమపై అదనపు భారం పడుతుందన్నారు.

News December 2, 2024

పెళ్లి ఇష్టం లేక యువకుడి సూసైడ్..

image

నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లిలో రైల్వే ట్రాక్‌పై యువకుడు <<14758454>>ఆత్మహత్య చేసుకున్నాడు.<<>> గ్రామానికి చెందిన వేణుకుమార్ రెడ్డి(29)కి ఇటీవలే నిశ్చితార్థం కాగా శనివారం రాత్రి వేణుగోపాల స్వామి దేవస్థానం కమాన్ దగ్గరలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి ఇష్టం లేకనే చనిపోతున్నానని వేణు అతని అన్న ప్రవీణ్‌కు వాయిస్ మేసేజ్ పంపాడు. అతను స్నేహితులకు సమాచారం ఇవ్వగా వారు వెళ్లేలోపే సూసైడ్ చేసుకున్నాడు.

News December 1, 2024

కోదాడ: బావిలో పడి విద్యార్థి మృతి

image

అనంతగిరి మండలం శాంతినగర్‌లోని ఎస్సీ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థి తిరుమలేష్ బావిలో పడి మృతి చెందాడు. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు కావడంతో ట్యూటర్ వీరబాబు ఇద్దరు విద్యార్థులను తన పొలం వద్ద పని ఉందని తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో వీరబాబు వ్యవసాయ బావిలో స్నానానికి దూకగా, అతనితోపాటు విద్యార్థి తిరుమలేష్ దూకాడు. ఈత రాకపోవడంతో తిరుమలేష్ మృతి చెందాడు.

News December 1, 2024

గోపలాయపల్లిలో రైల్వే ట్రాక్‌పై యువకుడు ఆత్మహత్య

image

నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లిలో రైల్వే ట్రాక్‌పై యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన కామసాని వేణుకుమార్ రెడ్డి(29) శనివారం రాత్రి వేణుగోపాల స్వామి దేవస్థానం కమాన్ దగ్గరలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. వేణుకుమార్ రెడ్డికి కొద్దిరోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ అయ్యిందని తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News December 1, 2024

డిసెంబర్ 3న యాదగిరిగుట్ట స్వామి వారి హుండీ లెక్కింపు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని డిసెంబర్ 3న లెక్కించనున్నట్లు శనివారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లచే, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో ఉండి లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News November 30, 2024

నల్గొండ జిల్లాకు ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్

image

తమిళనాడులో రాష్ట్రంలో ఏర్పడ్డ ఫెంగల్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై పడింది. మహబూబ్ నగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ వెదర్ ఏర్పడింది. దీంతో అధికారులు ఈ జిల్లాలలోని ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.

News November 30, 2024

విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్..!

image

నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిడమనూరు మోడల్ స్కూల్‌లో విద్యార్థినుల పట్ల సోషల్ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఏడవ తరగతి విద్యార్థిని ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు.

News November 30, 2024

సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. రూ.7.31 లక్షలు స్వాహా

image

సైబర్ నేరగాళ్ల వలలో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.7.31 లక్షలు పోగొట్టుకున్న ఘటన నల్లగొండ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన బండారు రమాదేవికి ఇటీవల ముంబై పోలీస్ అధికారులమంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె దశలవారీగా రూ.7. 31 లక్షలు ఫోన్ పే ద్వారా చెల్లించింది. ఆ తర్వాత ఆ నంబర్‌కు రమాదేవి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ మేరకు బాధితురాలు నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News November 30, 2024

NLG: డిసెంబర్ 6 వరకు పెన్షన్ల పంపిణీ

image

ఈనెల 29 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జిల్లాలో వివిధ రకాల చేయూత, ఆసరా ( వృద్ధాప్య, వికలాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళల పెన్షన్లు) పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెన్షన్లు పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేస్తామని.. పింఛన్దారులు పెన్షన్ మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుంచి తీసుకోవాలని సూచించారు.

News November 30, 2024

ఎంజీయూ నుంచి మొట్టమొదటి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్

image

MGU కామర్స్ విభాగం అధ్యాపకుడు డా కొసనోజు రవిచంద్ర తెలంగాణలోని నూతనంగా ఏర్పాటైన నాలుగు యూనివర్సిటీల్లో మొట్టమొదటి పోస్ట్ డాక్టోరల్ రీసర్చ్ స్కాలర్ గా చేరడంతో పాటు ఐసీఎస్ఎస్ఆర్ 2024-25 ఫెలోషిప్ కు ఎంపికయ్యారు. రవిచంద్ర తన పీజీ ఎంజీయూలోనే అభ్యసించి, తన గురువు కామర్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. కౌత శ్రీదేవి పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు.