Nalgonda

News June 3, 2024

ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం : కేటీఆర్

image

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ <<13368558>>హిందూపూర్ వాటర్ ట్యాంక్‌లో <<>>మృతదేహం లభించిన ఘటనపై ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విటర్ (ఎక్స్) వేదికగా నిప్పులు చెరిగారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని విమర్శించారు.

News June 3, 2024

సూర్యాపేట స్టూడెంట్ స్టేట్ ఫస్ట్

image

సూర్యాపేటకు చెందిన గోపగాని శ్రీనిఖ పాలిసెట్ (బైపీసీ స్ట్రీమ్)లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆమె 120 మార్కులకు 119.5 పొందారు. ఆమె తండ్రి గోపగాని సోమయ్య సూర్యాపేటలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం సహకారం, సూచనలతోనే ర్యాంక్ సాధ్యమైందని శ్రీనిఖ తెలిపింది. ఆమెను పలువురు అభినందించారు.

News June 3, 2024

నల్గొండ: మున్సిపల్ వాటర్ ట్యాంక్‌లో పడి వ్యక్తి మృతి

image

పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి మున్సిపల్ వాటర్ ట్యాంకులో శవమై తేలాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండలోని 28వ వార్డు హనుమాన్ నగర్ కాలనీకి చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్(26)గత నెల 24న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికారు. ఈరోజు పట్టణంలోని 12వ వార్డులో గల హిందూపూర్ మున్సిపల్ వాటర్ ట్యాంకులో శవమై కనిపించాడు.

News June 3, 2024

నల్గొండ: మిషన్ భగీరథ ట్యాంక్‌లో పడి వ్యక్తి మృతి

image

పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకులో శవమై తేలాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండలోని 28వ వార్డు హనుమాన్ నగర్ కాలనీకి చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్(26)గత నెల 24న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికారు. ఈరోజు పట్టణంలోని 12వ వార్డులో గల హిందూపూర్ మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకులో శవమై కనిపించాడు.

News June 3, 2024

రఘువీర్.. కృష్ణారెడ్డి.. సైదిరెడ్డి.. వీరిలో మన MP ఎవరు?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో నల్గొండ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి, BJP నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. కాగా నల్గొండ నుంచి కాంగ్రెస్ గెలుస్తుందని దాదాపు అన్ని సర్వేల్లో వెల్లడైంది. భారీ మెజార్టీ వస్తోందని హస్తం పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మీరేమంటారు.

News June 3, 2024

NLG: ఖరీఫ్ సాగుకు రైతన్న సన్నాహాలు

image

గతేడాది వ్యవసాయంలో ఎదురైన కష్టనష్టాలను పక్కనబెట్టి, మళ్లీ ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయన్న ఆశతో రైతన్నలు ఖరీఫ్ కు అన్ని విధాలుగా ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాలో అడపాదడపా కురుస్తున్న చిన్నపాటి వర్షాలకు రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు పుడమితల్లిని పదును చేస్తున్నారు. ఇప్పటికే రైతులు విత్తనాల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు.

News June 3, 2024

76.24 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం

image

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1.11 కోట్ల మొక్కలు నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం విధించింది. పర్యావరణ, అటవీ, పంచాయతీ రాజ్, రహదారులు, నీటి పారుదల, వ్యవసాయ, రెవెన్యూ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, విద్య, పశు సంవర్ధక, వైద్యారోగ్య, సాంఘిక సంక్షేమ తదితర శాఖలకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించి ఒక్కో శాఖకు ఒక్కో లక్ష్యాన్ని నిర్దేశించింది. నర్సరీల్లో సుమారు 76.24 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచారు.

News June 3, 2024

 SRPT: భర్త మృతి, చెరువులో దూకి భార్య సూసైడ్ 

image

భర్తపై బెంగతో భార్య చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోతె మండల పరిధిలోని పేదరాజుతండాలో ఆదివారం జరిగింది. ఏఎస్ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. బానోతు రంగమ్మ(80) భర్త గత నెల 5వ తేదీన మృతి చెందారు. భర్తపై బెంగతో గ్రామ పరిధిలోని చెరువులో దూకి రంగమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు హంస్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 3, 2024

BREAKING: చిట్యాల వద్ద యాక్సిడెంట్

image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతోంది.

News June 3, 2024

NLG: ఎంపీ ఎన్నికల కౌంటింగ్ ఇలా..

image

నల్లగొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో అత్యధికంగా 324 పోలింగ్ బూత్‌లు ఉన్న దేవరకొండ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు 24 రౌండ్లలో పూర్తి కానుండగా మిర్యాలగూడ నియోజకవర్గంలో 264 బూత్‌లు ఉండగా 19 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలుండగా.. 22 రౌండ్లు పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది.