India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశాన్ని బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన మహాత్మా గాంధీకి చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో గుడి కట్టి పూజలు చేస్తున్నారు. మహాత్మా గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గుడిని నిర్మించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుని గురించి భావి తరాలకు తెలియాలనే ఉద్దేశంతో గుడి కట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కాగా నేడు గాంధీ వర్ధంతి.
నాగార్జున సాగర్‌లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతి కుమారి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని CM సూచించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అర్హులైన BS, EBC, SC, ST అభ్యర్థులకు SSC, RRB, బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉపాధి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం సంచాలకుడు ఖాజా నజీమ్ అలీ అఫ్సర్ తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలన్నారు. ఫిబ్రవరి 9 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
NLG జిల్లాలోని మున్సిపాలిటీలకు ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేదని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలానికి తెరపడిన విషయం తెలిసిందే. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆ మరుసటి రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మరో ఆరు నెలలు లేదా ఏడాది పాటు ప్రత్యేక పాలన కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా మున్సిపాలిటీలలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ గాంధీ భవన్‌లో నేడు మంత్రులతో ముఖాముఖీ జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పాయి. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవచ్చని సూచించాయి.
నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3 నుండి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆలయ అర్చకులతో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
నల్గొండ జిల్లాలో ఫర్టిలైజర్ షాపుల యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం కనగల్ మండల కేంద్రంలో ఆ షాపులను ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా బ్లాక్‌లో అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభమైంది. కాగా NLG జిల్లాలో తొలిరోజు 31 మండలాలకు సంబంధించిన 35,568 మంది రైతులకు రూ. 46.93 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. NLG జిల్లా వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ద్వారా పెట్టుబడి కింద సాగుకు యోగ్యంగా లేని 12,040 ఎకరాల భూములకు కూడా రైతు భరోసా చెల్లించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ భూములకు రైతు భరోసా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్‌ను ప్రారంభించినట్లు NLG ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఈ ఆన్‌లైన్ యాప్లో నిరుద్యోగులు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు.
నల్గొండ జిల్లాలోని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా జమ చేసింది. జిల్లాలోని 33 మండలాలకు గాను గట్టుప్పల్, గుడిపల్లి మండలాలు మినహా 31 మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పెట్టుబడి సాయాన్ని జమచేసింది. 35,568 రైతుల ఖాతాల్లో 73,243 ఎకరాలకు ఎకరాకు రూ.6వేల చొప్పున మొత్తం రూ.46,93,19,160 జమ చేసింది.
Sorry, no posts matched your criteria.