India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ మధ్య కాలంలో జిల్లాలో వీధి కుక్కల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో జిల్లాలోని 526 గ్రామపంచాయతీల్లో అధికారులు సర్వే నిర్వహించి కుక్కలను లెక్కించారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 22 మండలాల్లో 12,603 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. సంతాన నిరోధానికి ఆడ కుక్కలకు శస్త్ర చికిత్సలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి హైదరాబాద్ నగరంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పలు అంశాల గురించి చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట ఆర్మూర్ ప్రాంతానికి చెందిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.
*నిజామాబాద్‌లో గల్లంతైన చిన్నారి అనన్య మృతదేహం లభ్యం
*ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకుల ధర్నా
*బోధన్:కొడుకు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి
*కామారెడ్డి: రైలు కింద పడి యువకుడి మృతి
*HYD ఈడీ కార్యాలయం ముందు నిరసనలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
*రేవంత్ రెడ్డిని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే
*బాన్సువాడ, బోధన్‌కు సబ్ కలెక్టర్ల నియామకం
ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పలు సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో 2022 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ సబ్ కలెక్టర్‌గా కిరణ్మయి కొప్పిశెట్టి, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ సబ్ కలెక్టర్‌గా వికాస్ మహతో నియమితులయ్యారు.
కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి చెందిన ఘటన బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయికుమార్ (22) ఐదు రోజుల క్రితం రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకుర్తి గోదావరిలో ఈతకు వెళ్లి మృతి చెందడు. అయితే కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి దేవర్ల వెంకటేశ్(54) గురువారం గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
కమ్మర్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చిరుతపులి మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ సమీపంలో చిరుతపులి చనిపోయి ఉందని పశువుల కాపరి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత పులి 2 రోజుల క్రితం చనిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద అది 2 కూనలతో సంచరించినట్లు కాపరులు తెలిపారు.
తాడ్వాయి మండలంలో బస్సుల కొరత, సమయానికి సరిపడా బస్సులు రాక ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఉదయం వచ్చే బస్సులు సైతం రద్దిగా ఉండడంతో అర్గోండ గ్రామానికి చెందిన విద్యార్థులకు కామారెడ్డికి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడంలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆనంద్‌నగర్ లో నిన్న సాయంత్రం వరద నీటిలో <<13910342>>గల్లంతైన చిన్నారి <<>>అనన్య మృతదేహం లభ్యమయింది. రాత్రి వరకు మున్సిపల్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది గాలించినప్పటికీ చీకటి కారణంగా ఆచూకీ దొరకలేదు. అయితే డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ మహిపాల్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది మున్సిపల్ కార్మికులతో గాలింపు చర్యలు చేపట్టగా పీఎఫ్ ఆఫీస్ వెనుక ప్రాంతంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది.
ప్రభుత్వ ఆసుపత్రులు జ్వరాల బారినపడిన వారితో కిటకిటలాడుతున్నాయి. డెంగీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జనరల్ హస్పిటల్లో ఓపీ 2 వేలు దాటుతోంది. పీహెచ్సీలు, సీహెచ్సీల్లోనూ ఓపీ పెరిగింది. 3నెలల్లో డెంగీ కేసుల పెరుగుదల ఇలా ఉంది. జూన్లో 13, జులై72, ఆగస్టు 133 కేసులు నమోదయ్యాయి. GGHలో జూన్లో 47230 ఓపీ, 3470 ఐపీ, జులైలో 62124 ఓపీ, 3636 ఐపీ, ఆగస్టులో 37516 ఓపీ, 2381 ఐపీలున్నాయి.
రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో BRS తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ పెద్ద సంఖ్యలో రైతన్నలు హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.