India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NZB పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్‌ను పూర్తి స్థాయి ప్రక్షాళన చేశారు. ఒకే రోజులో ఏకంగా 14 మందిపై బదిలీ వేటు వేశారు. CI అంజయ్యను CCRBకి, SI గోవింద్ ఆర్మూర్, శివరాం CCRBకి అటాచ్ చేశారు. సిబ్బంది యాకుబ్ రెడ్డి, లస్మన్న, సుధీర్, అనిల్ కుమార్, రాజు, సచిన్, అన్వర్, అనిల్, శ్రీనివాస్, ఎన్.సచిన్, సాయినాథ్‌ను వివిధ పోలీస్ స్టేషన్లు, ARకు అటాచ్ చేశారు.
మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆయన మత్స్యశాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 967 చెరువుల్లో 4.5 కోట్ల చేప పిల్లలను వదలాలని నిర్ధేశించిన లక్ష్యం మేరకు చేప పిల్లల పిల్లల పెంపకానికి చొరవ చూపాలన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో సోమవారం 39 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాత్రి ఇన్ ఫ్లో కొంచెం తగ్గడంతో ఒక వరద గేటును మూసి 38 గేట్ల ద్వారా 1,32,390 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందిరమ్మ కాల్వకు 18 వేలు, కాకతీయ కాల్వకు 4,700 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 1,17,148 క్యూసెక్కుల నీరు వస్తోందని SRSP అధికారులు చెప్పారు.
నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచనున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా అనునిత్యం పర్యవేక్షించాలన్నారు.
వ్యవసాయ అవసరాల కోసం కేటాయిస్తున్న యూరియా ఎరువులను పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు స్పష్టం చేశారు. సోమవారం వారు రాష్ట్ర సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్, సంచాలకులు గోపితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
డిచ్‌పల్లి CMC మెడికల్ కాలేజ్ వ్యవహారంపై ఛైర్మెన్ షణ్ముఖ మహా లింగం సోమవారం NZB ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. CMCలో 4 నెలలుగా జరిగిన అవినీతి, అక్రమాలు, నియామకాలు తదితర వివరాలను వివరించారు. IMA NZB అధ్యక్షుడిగా పరిచయమైన డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో పని చేస్తున్న డాక్టర్ సుమంత్ చర్యలపై ఆరోపణలు గుప్పించారు. దొంగ ఎవరో మీరే తేల్చండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలపై సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు మంగళవారం సాయంత్రం లోపు ఆయా శాఖల వారీగా నివేదికలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు విషయంపై అధికారులకు పలు సూచనలు చేశారు.
నిజామాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలపై అర్జీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్, మెప్మా పీడీ, ఏసీపీ పాల్గొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని NZBకలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సోమవారం వినాయకనగర్‌లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా కొనసాగుతోంది. 19,397 ఇళ్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 17,301 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 9,486 ఇళ్లకు మార్కింగ్, 4,820 ఇళ్లకు బేస్‌మెంట్ పనులు పూర్తయ్యాయి. 742 ఇళ్లు రూఫ్ లెవల్, 237 ఇళ్లు స్లాబ్ లెవల్ వరకు వచ్చాయి. ఈ పనులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 60.36 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.