India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ మండలం రామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే 46 బాన్సువాడ ఆసుపత్రికి, 12 మందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాక్ శిక్షణ కేంద్రంలో ఎలక్ట్రికల్, సర్వేయర్, ప్లంబర్, మేస్త్రీ, పెయింటింగ్, టైలరింగ్ పెయిడ్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత వయస్సు 18 నుంచి45 సంవత్సరాలు అని సూచించారు. మరిన్ని వివరాలకు న్యాక్ కేంద్రాన్ని సందర్శించాలన్నారు.
గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఆర్మీ అధికారుల నేతృత్వంలో పారా గ్లైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 250వ ఏఓసీ కార్ప్స్ డే సందర్భంగా సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో పారా మోటార్ ఎక్స్ పెడిషన్-2025 యాత్రను చేపట్టారు. ఢిల్లీ నుంచి ప్రారంభమైన యాత్ర ఆగ్రా, కాన్పూర్, ఝాన్సీ, సాగర్, జబల్పూర్, పుల్గాంల మీదుగా సాగుతూ నిజామాబాద్ నగరానికి చేరుకుంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో తల్లి పక్కన నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారి రమ్య కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. సీసీ కెమెరాలో ఓ దుండగుడు చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందలతో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి ఆచూకీ తెలిస్తే 8712659837 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని వన్ టౌన్ SHO రఘుపతి సూచించారు.
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నెలకొల్పిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ప్రారంభించారు. చల్లని తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అన్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జడ్పీ సీఈఓ సాయాగౌడ్ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని యువతి సూసైడ్ చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చేగుంటలో చోటుచేసుకుంది. SI చైతన్య కుమార్ రెడ్డి వివరాలు.. KMR జిల్లా భగీరథపల్లికి చెందిన వరలక్ష్మి(18) కొద్దిరోజులుగా బోనాలలోని సోదరి ఇంటివద్ద ఉంటుంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఆమె ప్రేమలో పడింది. వరుస కలవదని తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈనెల 4న విషం తాగింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.
శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో ఆదివారం నిజామాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట వివాహం చేసుకున్నారు. ప్రతి ఏటా భద్రాచలం, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి వివాహాలు ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది తొలిసారిగా జిల్లా కేంద్రంలోని రామాలయంలో ట్రాన్స్ జెండర్లు వివాహం చేసుకున్నారు.
శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో ఆదివారం నిజామాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట వివాహం చేసుకున్నారు. ప్రతి ఏటా భద్రాచలం, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి వివాహాలు ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది తొలిసారిగా జిల్లా కేంద్రంలోని రామాలయంలో ట్రాన్స్ జెండర్లు వివాహం చేసుకున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద 2వ పిరమిడ్ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం సందర్శించారు. ఇక్కడి పిరమిడ్ విశిష్టతను సీపీకి వివరించామని PSSM జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సీఐ సత్యనారాయణ, PSSM సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.