India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారీ వర్షాలకు సహాయక చర్యలు అవసరమైన పక్షంలో కలెక్టరేట్లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462 – 220183కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని NZB జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ప్రజలకు సూచించారు. భారీ వర్షాల వల్ల ఎక్కడైనా ప్రమాదం ఎదురైనా, లేక అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కంట్రోల్ రూంకు ఫోన్ చేయాలన్నారు. ఇప్పటికే పర్యవేక్షణ చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించామన్నారు.
NZB జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతంతో పాటు నదులు, వాగుల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావొద్దని హితవు పలికారు. చేపల వేట, ఈత సరదా కోసం చెరువులు, కాల్వలు, కుంటలు, ఇతర జలాశయాల వద్దకు వెళ్లకూడదని సూచించారు.
భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ శివారులోని పేకాట స్థావరంపై పోలీసులు బుధవారం ఆకస్మికంగా దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.14,110 నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని ఎస్ఐ పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 19,306 ఇళ్లను కేటాయించాలని లక్ష్యం కాగా 17,291 ఇళ్లు మంజూరు చేశామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఈరోజు తెలిపారు. వాటిలో 9,360 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని, 5,541 నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. వీటిలో 4,647 ఇళ్లు బేస్మెంట్ దశలో, 665 ఇళ్లు గోడల దశలో, 229 గృహాలు స్లాబ్ లెవెల్లో ఉన్నాయని కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో వివరించారు.
నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేషుగ్గా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ.గౌతమ్ జిల్లా యంత్రాంగం పనితీరును ప్రశంసించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డీ వీపీ.గౌతమ్ బుధవారం నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి, డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఏదైనా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, అలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. బుధవారం వేల్పూర్ PHCని తనిఖీ చేసి ఆయన మాట్లాడారు. లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు వంటివి చోటుచేసుకోకుండా గట్టి నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. బుధవారం వేల్పూర్ ZPHSను తనిఖీ చేసిన ఆయన పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నేషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తితే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.
మోపాల్ మండలం బైరాపూర్‌లో రమావత్ ప్రకాశ్ అనే రైతు పొలంలో నిన్న అటవీ అధికారులు మొక్కజొన్న పంటను నాశనం చేశారని, దీంతో బాధిత రైతు గడ్డిమందు తాగాడని బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఈరోజు FRO రాధికకు ఫిర్యాదు చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ప్రకాశ్‌కు పోడు పట్టాను అందజేసి, ఆయనపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి రమావత్ ప్రకాశ్‌ను పరామర్శించారు.
ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోన్న యూరియాను వ్యవసాయేతర పనులకు వాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ స్పష్టం చేశారు. ఎడపల్లి మండలం పోచారంలో గల పౌల్ట్రీ ఫారంను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పౌల్ట్రీ ఫారంలో యూరియాను వాడుతున్నారా అనే అంశంపై ఆరా తీశారు. వ్యవసాయేతర పనులకు యూరియాను వినియోగిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తోందని సాంస్కృతిక విప్లవంతో పాటు సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధనకు ఒక్క అంశాన్ని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.
Sorry, no posts matched your criteria.