India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీయూ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువును వర్సిటీ అధికారులు పొడిగించారు.ఈ నెల 26తో ముగియనున్న గడువును వచ్చే నెల7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.100అపరాధ రుసుముతో 8వ తేదీ వరకు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ. కే.సంపత్ కుమార్ పేర్కొన్నారు. B.A, B.COM, BSC, BBA కోర్సుల II,IV,VI సెమిస్టర్ రెగ్యులర్, I,III,Vబ్యాక్ లాగ్ పరీక్షలు ఏప్రిల్, మే లో జరగనున్నాయి.
నిజామాబాద్‌లో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వివేకానంద కాలనీకి చెందిన కొత్త రాములు(58) గుమస్తాగా పని చేస్తున్నాడు. సదరు వ్యక్తికి అనారోగ్య సమస్యల కారణంగా ఈనెల 24వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కల్లులో గడ్డి మందు కలిపి తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు.
నిజామాబాద్‌లో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వివేకానంద కాలనీకి చెందిన కొత్త రాములు(58) గుమస్తాగా పని చేస్తున్నాడు. సదరు వ్యక్తికి అనారోగ్య సమస్యల కారణంగా ఈనెల 24వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కల్లులో గడ్డి మందు కలిపి తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు.
స్వయం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రుణ బీమా, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు గురువారం సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. బీమా సౌకర్యం వివరాలను స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ తెలియజేయాలన్నారు.
నిజామాబాద్ జిల్లాలోని గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని TGRJC CET నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ గంగా శంకర్ తెలిపారు. మార్చి 24 నుంచి ఏప్రిల్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. మే 25న జిల్లా కేంద్రంలో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.
HYD గచ్చిబౌలి పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలానికి చెందిన కార్తీక్ (14) చెరువులో నీట మునిగి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కుర్ల గ్రామానికి చెందిన మల్కయ్య-బాలమణి దంపతులు నానక్‌రాంగూడలో పనిచేస్తున్నారు. కాగా కొడుకు కార్తీక్ సోమవారం కనిపించకుండా పోయాడు. మంగళవారం తల్లిదండ్రులు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా బుధవారం విప్రో లేక్‌లో శవమై తేలాడు.
TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం నిజామాబాద్, కామారెడ్డి డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
కామారెడ్డి జిల్లా జుక్కల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో పదో తరగతి గణిత ప్రశ్నల లీక్‌పై అధికారులు తీవ్రంగా స్పందించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, DEO రాజు, తహశీల్దార్ విచారణ చేపట్టారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ భీం, ఇన్విజిలేటర్ దీపికలను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు.
నవీపేట్ మండలం మిట్టపూర్ గ్రామానికి చెందిన లక్ష్మన్న(49) మంగళవారం బాసర గోదావరిలో చేపలు వేటకు వెళ్లి కాళ్లకు వల చుట్టుకుని గోదావరిలో పడి మృతి చెందినట్లు నవీపేట్ ఎస్ఐ వినయ్ వినయ్ కుమార్ తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఎస్సారెస్పీ నుంచి ఆయకట్టు పంటలకు ఏప్రిల్ 9 వరకు చివరి తడి కింద సాగునీరు అందిస్తామని ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి తెలిపారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నతస్థాయి కమిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సూక్ష్మ నీటి లిఫ్ట్ స్కీం కింద ఆయకట్టుకు ఏప్రిల్ 9 ఉదయం 6 గంటల వరకు మాత్రమే సాగునీటిని అందించనున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.